ఏడాది ముందుగానే సాగునీరు అందడంతో ఆత్మవిశ్వాసంతో అన్నదాతలు సిరుల పంటలు పండించాలని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి కోరారు. కర్ణాటకలోని నారాయణపుర ప్రాజెక్టు నుంచి వరద వస్తుండటంతో ఆదివారం రాత్రి ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు కుడి, ఎడమ కాల్వలకు జెడ్పీ చైర్పర్సన్ సరిత, గద్వాల, అలంపూర్, మక్తల్, దేవరకద్ర ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, అబ్రహం, చిట్టెం రామ్మోహన్‌రెడ్డి, ఆల వెంకటేశ్వర్‌రెడ్డితో కలిసి మంత్రి పూజలు చేసి రెగ్యులేటర్లను ఎత్తి నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాగునీటి విషయంలో అన్నదాతలు ఆందోళన చెందొద్దన్నారు. ఇప్పటికే రైతుబంధుకు రూ.7,253 కోట్లు విడుదల చేశామని తెలిపారు. ప్రభుత్వం సూచించిన నియంత్రిత పంటల సాగుకు సహకరించి పంటలు సాగు చేసుకోవడం సంతోషకరమన్నారు. - గద్వాల
గద్వాల : రైతులు ఆత్మవిశ్వాసంతో సాగు చేసి సిరుల పంటలు పండించాలని వ్యవసాయ, మా ర్కెటింగ్ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అ న్నారు. ప్రభుత్వం సూచించిన నియంత్రిత పం టల సాగుకు సహకరించి సాగు చేసుకోవడం సంతోషకరమన్నారు. కర్ణాటకలోని నారాయణపుర ప్రాజెక్టు నుంచి రెండు గేట్ల ద్వారా నీటి వి డుదల చేశారు. దీంతో ఆదివారం రాత్రి ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు నుంచి కుడి, ఎడమ కా ల్వలకు మంత్రి నిరంజన్‌రెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ సరిత, ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, అ బ్రహం, చిట్టెం రామ్మోహన్‌రెడ్డి, ఆల వెంకటేశ్వర్‌రెడ్డిలతో కలిసి పూజలు చేసి రెగ్యులేటర్లను ఎత్తి నీటి విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జూరాల కుడి, ఎడమ కాల్వల ద్వారా లక్ష 4 వేల ఎకరాలకు సాగునీరు అందిస్తామన్నారు. ఎగువ ప్రాంతంలోని నదులు, ఉ పనదుల నుంచి వస్తున్న వరద నీటిని ఆయకట్టు కు విడుదల చేయాలని ఆదివారం సాయంత్రం సీఎం కేసీఆర్ ఫోన్లో ఆదేశించడంతో నీటిని వ దిలామన్నారు.
గతేడాది వర్షాలు సమృద్ధిగా కురవడంతో మార్చి, ఏప్రిల్ 15వ తేదీ వరకు ఉమ్మ డి జిల్లాలోని ప్రాజెక్టుల ద్వారా సాగునీరు అం దించామన్నారు. ఈ ఏడాది ఎగువన ఉన్న నా రాయణపుర ప్రాజెక్టు నుంచి ముందస్తుగా 30 వేల క్యూసెక్కులు జూరాలకు వస్తుండటంతో కుడి, ఎడమ కాల్వలకు నీటిని వదిలామన్నారు. జూరాల, నెట్టెంపాడ్, ఎంజీకేఎల్ఐ, కోయిల్‌సాగర్, రామన్‌పాడ్, భీమా లిఫ్ట్‌ల ద్వారా ఉమ్మడి జిల్లాకు నీరందిస్తామని చెప్పారు. ఉమ్మడి జిల్లాలోని చెరువులు, రిజర్వాయర్లను నింపేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఇప్పటికే గతేడాది నీళ్లతో సగం చెరువులు నిండుకుండలను తలపిస్తున్నాయన్నారు. ఉమ్మడి పాలమూరు జి ల్లాలో ప్రతి ఎకరాకూ సాగునీరు అందించాలనే లక్ష్యంతో పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప థకాన్ని సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టార ని వివరించారు. అనుకున్న సమయంలో ప్రాజెక్టును పూర్తి చేసి పాలమూరు, నల్లగొండ, రంగారెడ్డి జిల్లాలకు సాగునీరు అందిస్తామని తెలిపా రు. ఆర్డీఎస్ ఆయకట్టుకు పునరుజ్జీవం పోసేందుకు 2018లో తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకాన్ని రూ.783 కోట్లతో చేపట్టామన్నారు. ప్రస్తుతం ఒక పంపును పూర్తి చేసి 55,500 ఎకరాలకు తుమ్మిళ్ల పథకం ద్వారా సాగునీరు అందిస్తున్నామన్నారు. తుంగభద్ర నదికి వరద రాగానే తు మ్మిళ్ల పంపును ప్రారంభించేందుకు చర్యలు తీ సుకుంటామన్నారు. సాగునీటికి ఢోకా లేకుండా చూస్తామన్నారు. ఈ ఏడాది వానకాలంలో రూ.7,253 కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేశామన్నారు. రైతులకు ఎరువులు, విత్తనాలు కొరత లేకుండా చర్యలు చేపట్టిందన్నారు.
ఆరుగాలం కష్టపడి రైతు పండించిన పంటను మద్ధతు ధర కు కొనుగోలు చేస్తున్నామన్నారు. కార్యక్రమం లో పీజేపీ ఈఈలు పార్థసారధి, రహీముద్దీన్, ఎంపీపీ శ్రీనివాసులు, వైస్ ఎంపీపీ కోటేశ్వర్, పీఏసీసీఎస్ అధ్యక్షులు కృష్ణమూర్తి, లక్ష్మీకాంత్‌రెడ్డి, మాజీ ఎంపీపీ శ్రీధర్‌గౌడ్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రవికుమార్‌యాదవ్, వైస్‌చైర్మ న్ విజయభాస్కర్‌రెడ్డి, మార్కెట్ కమిటీ వైస్‌చైర్మన్ నాగభూషణంగౌడ్, ఆత్మకూరు, అమరచిం త మండలాల నాయకులు, కౌన్సిలర్లు, ఎంపీపీ లు, జెడ్పీటీసీలు, సర్పంచులు, ఎంపీటీసీలు, అ ధికారులు పాల్గొన్నారు.