శుక్రవారం 14 ఆగస్టు 2020
Gadwal - Jul 10, 2020 , 03:03:53

ప్రతిఒక్కరికీ అండగా సీఎం సహాయనిధి

ప్రతిఒక్కరికీ అండగా సీఎం సహాయనిధి

  • జెడ్పీ వైస్‌ చైర్మన్‌ వామన్‌గౌడ్‌

కొత్తకోట : ఆపదలో ఉన్న ప్రతి ఒక్కరికీ సీఎం సహాయనిధి అండగా ఉందని జెడ్పీ వైస్‌చైర్మన్‌ వామన్‌గౌడ్‌ అన్నారు. గురువారం కొత్తకోటలోని హెబ్రోన్‌ సీయోన్‌ సంఘం చర్చిలో సీఎం సహాయనిధి నుంచి మంజూరైన చెక్కులను బాధితులకు ఆయన అందజేశారు. ఈ సందర్భంగా జెడ్పీ వైస్‌చైర్మన్‌ మాట్లాడుతూ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి సహకారంతో బాధితులకు ఆర్థిక సాయం మంజూరైనట్లు ఆయన తెలిపారు. మొత్తం 15 మంది బాధితులకు రూ.6,72,500 విలువ గల చెక్కులను అందజేయడం జరిగిందన్నారు. కార్యక్రమంలో సీడీసీ చైర్మన్‌ జగన్మోహన్‌రెడ్డి, ఉమ్మడి జిల్లాల అధికార ప్రతినిధి ప్రశాంత్‌, సర్పంచుల సంఘం మండలాధ్యక్షుడు శ్రీనివాసులు, కౌన్సిలర్లు పద్మ, మహేశ్వరి, రాములుయాదవ్‌, నాయకులు అయ్యన్న, మిషేక్‌, సుభాష్‌, వినోద్‌సాగర్‌, వసీంఖాన్‌, శాంతిరాజు, వికాస్‌, అంజి, కిరణ్‌, అమృతరాజు, శేఖర్‌, సతీశ్‌రాజ్‌ తదితరులు పాల్గొన్నారు. 

మదనాపురంలో..

మదనాపురం : మండలంలోని పలు గ్రామాలకు చెందిన బాధితులకు సీఎం సహాయనిధి నుంచి మంజూరైన చెక్కులను ఎంపీపీ పద్మావతి తన కార్యాలయంలో గురువారం అందజేశారు. మదనాపురం గ్రామానికి చెందిన అబితేజకు రూ.15వేలు, జయమ్మకు రూ.18వేలు, అజ్జకొలుకు చెందిన లక్ష్మికి రూ.34వేలు, దంతనూర్‌కు చెందిన రవికి రూ.44వేలు విలువ గల చెక్కులను ఆమె అందజేశారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ కృష్ణయ్య, సర్పంచ్‌ రామానారాయణ, వైస్‌ ఎంపీపీ యాదమ్మ, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు రాములు, వెంకట్‌నారాయణ ఉన్నారు. 

గోపాల్‌పేటలో..

గోపాల్‌పేట : మండలంలోని బుద్దారం గ్రామానికి చెందిన బత్తుల రాములు యాదవ్‌ అనారోగ్యానికి గురై హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ దవాఖానలో చికిత్స చేయించుకున్నాడు. వైద్య ఖర్చులకోసం ఆయన సీఎం సహాయనిధికి దరఖాస్తు చేసుకోగా రూ.60వేల చెక్కును గురువారం జెడ్పీటీసీ భార్గవి వనపర్తిలోని ఆమె ఇంటి వద్ద బాధితుడికి అందజేశారు. కార్యక్రమంలో మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ వాకిటి శ్రీధర్‌, టీఆర్‌ఎస్‌ నాయకుడు శ్రావణ్‌కుమార్‌ ఉన్నారు.


logo