మంగళవారం 09 మార్చి 2021
Gadwal - Jul 10, 2020 , 02:37:33

దంతాలతో జన్మించిన శిశువు..!

దంతాలతో జన్మించిన శిశువు..!

గద్వాల అర్బన్‌: దంతాలతో ఓ శిశువు జన్మించిన ఘటన జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రంలో చోటుచేసుకున్నది. జిల్లా కేంద్రానికి చెందిన సుచిత్రకు గురువారం పురిటి నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు పట్టణంలోని ఓ ప్రైవేట్‌ దవాఖానకు తీసుకెళ్లారు. వైద్యులు ఆపరేషన్‌ చేసి ఆడశిశువును బయటకు తీయగా, రెండు దంతాలతో పాప జన్మించినట్లు గుర్తించారు. ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడుతూ జన్యులోపంతో ఇలాంటివి జరుగుతుంటాయని, తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారని తెలిపారు.

VIDEOS

logo