ఆదివారం 28 ఫిబ్రవరి 2021
Gadwal - Jul 02, 2020 , 01:30:01

కార్యకర్తలకు అండగా ఉంటా : ఎమ్మెల్యే బీరం

కార్యకర్తలకు అండగా ఉంటా : ఎమ్మెల్యే బీరం

కోడేరు : కొల్లాపూర్‌ నియోజకవర్గంలో టీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలకు తాను వెన్నంటే ఉంటానని ఎమ్మె ల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి పేర్కొన్నారు. మండలంలోని సింగాయిపల్లి గ్రామంలో బుధవారం సాయంత్రం మాజీ మంత్రి  జూపల్లి వర్గానికి చెందిన పలువురు నా యకులు, కార్యకర్తలు ఎమ్మెల్యే సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. గ్రామ ఉపసర్పంచ్‌ మధు, మాజీ సర్పంచ్‌ భర్త సు గుణాచారి, వార్డు సభ్యులు రాఘవేంద్రాచారి, పి,ఎల్లమ్మ, రేణుక, ఆంజనేయు లు, అలివేలతో పాటు యువ నాయకు లు గోపాల్‌, రాము, కురుమూర్తి, లింగారెడ్డి, సాయి, భీముడు, శివ, సుదర్శన్‌, లక్ష్మయ్య, రాంబాబుతోపాటు మరో 30 మంది టీఆర్‌ఎస్‌ తీర్థం పుచ్చుకున్నారు. వీరికి కండువాలు కప్పి ఎమ్మెల్యే ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ సీఎం కేసీఆర్‌ అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ పథకాలకు ఆకర్షితులైన వివిధ పార్టీల కార్యకర్తలు గులాబీ పార్టీ గూటికి చేరుతున్నారని అన్నారు. గతం లో ఏ ప్రభుత్వం చేపట్టని విధంగా సా గు, తాగునీరు, వ్యవసాయంతో పాటు వివిధ రంగాలను అభివృద్ది చేస్తున్న ప్రభుత్వానికి ప్రతి ఒక్కరూ అండగా నిలుస్తున్నారని అన్నారు. నియోజకవర్గంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి పథకాలను అర్హుల దరి చేరుస్తున్నామని చెప్పారు. కార్యకర్తలు ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదని, ఏ సమస్య ఎదురైనా మీ వెంట ఉంటానని ధైర్యం చె ప్పారు. కార్యక్రమంలో తెలంగాణ క్రికెట్‌ అసోషియేషన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దూరెడ్డి రఘువర్ధన్‌రెడ్డి, నాయకులు రాజశేఖర్‌గౌడ్‌, విండో డైరెక్టర్‌ జగన్‌మోహన్‌రెడ్డి, అంబేద్కర్‌ పాల్గొన్నారు. 

VIDEOS

logo