లండన్: బాలీవుడ్ బ్యూటీ ప్రియాంకా చోప్రా.. లండన్‌లో జరిగిన బాఫ్టా వేడుకల్లో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. అవార్డ్స్ సెర్మనీ సందర్భంగా జరిగిన రెడ్‌కార్పెట్‌లో జిగేలన్నది. బాఫ్టా వేడుకకు ముందు బ్లూ బట్టర్ఫ్లై దుస్తులతో తెగ అట్రాక్ట్ చేసిన ప్రియాంకా.. ఇక రెడ్‌కార్పెట్‌లో ఎరుపు రంగు డ్రెస్సులో కేక పుట్టించింది. అమెరికన్ స్టయిలిస్టు లా రోచ్.. ప్రియాంకా కొత్త లుక్‌ను డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. భర్త నిక్ జోనస్‌తో ప్రియాంకా అవార్డ్స్ సెర్మనీకి హాజరయ్యింది. ఈ కార్యక్రమంలో ప్రియాంకా ప్రజెంటర్‌గా కూడా చేసింది. ప్రియాంకా నటించిన ద వైట్ టైగర్ చిత్రం కూడా బాఫ్టా అవార్డుల కోసం పోటీపడిన విషయం తెలిసిందే. ఉత్తమ నటుడి క్యాటగిరీలో ఆదర్శ్ గౌరవ్ పోటీపడ్డాడు. కానీ అతనికి అవార్డు దక్కలేదు.