పెండింగ్ పనులను త్వరగా పూర్తిచేయండి

ఉండవెల్లి : నియోజకవర్గంలో పెండింగ్‌లో ఉన్న బ్రిడ్జి పనులను త్వరగా పూర్తి చేయించాలని ఎమ్మెల్యే అబ్రహం ఆర్అండ్బీ అధికారులను ఆదేశించారు. మండలంలోని అలంపూర్ చౌరస్తా వద్ద ఉన్న ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మంగళవారం ఆర్అండ్బీ ఆధికారులతో ఎమ్మెల్యే సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కలుకుంట్ల బ్రిడ్జి నిర్మాణం పూర్తి అయినా బీటీరోడ్డు పెండింగ్‌లో ఉంచిన కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. బొంకూరు, ఎక్లాస్పురం, ఆర్ గార్లపాడు, సాతర్ల గ్రామాలలో నిర్మిస్తున్న బ్రిడ్జి పనులను త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు సమస్య లేకుండా చూడాలన్నారు. అలాగే అలంపూర్ మండలం ర్యాలంపాడు బ్రిడ్జి పనులు పూర్తయిన అప్రోచ్ బీటీరోడ్డును ఇంకా నిర్మించలేదని సదరు కాంట్రాక్టర్‌తో మాట్లాడి సమస్యను పరిష్కరించాలన్నారు. కార్యక్రమంలో ఆర్అండ్బీ డీఈ కిరణ్, ఏఈలు లక్ష్మన్న, మహేశ్ తదితరులు పాల్గొన్నారు.
40 ఏండ్ల తరువాత గ్రామానికి రోడ్డు సౌకర్యం
మానవపాడు : టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మారుమూల ప్రాంతాలకు సైతం రోడ్డు సౌకర్యం కల్పించడం జరిగిందని ఎమ్మెల్యే అబ్రహం అన్నారు. మంగళవారం మండల పరిధిలోని జల్లాపురం గ్రామం నుంచి చండూరు గ్రామం వరకు రూ.కోటి 25లక్షలతో నిర్మిస్తున్న బీటీ రోడ్డు నిర్మాణానికి ఎమ్మెల్యే అబ్రహం జెడ్పీ చైర్పర్సన్ సరితతో కలిసి భూమిపూజ చేశారు. ఈ సంద ర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ శ్రీశైలం నీటి ముంపు గ్రామం అయిన చండూరుకు 40 ఏండ్ల తరువాత రోడ్డు సౌకర్యం కల్పించడం జరిగిందన్నారు. తెలంగాణ ప్రభు త్వం గ్రామాలను అభివృద్ధి చేయడంతో పాటు అన్ని వర్గాల వారికి సంక్షేమ పథకాలు అందిస్తోందని తెలిపారు. కార్య క్రమంలో డీఈ ఆంజనేయలు, ఏఈ నరేందర్, జో గుళాంబ ఆలయ కమిటీ మాజీ చైర్మన్ వెంకటేశ్వర్లు, సర్పంచుల సంఘం అధ్యక్షుడు ఆత్మలింగా రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు దామోదర్ రెడ్డి, చండూరు సర్పంచ్ నర్సింహులు, గుత్తేదారు శేషిరెడ్డి పాల్గొన్నారు.
తాజావార్తలు
- సందేహాలు తీర్చేందుకే యూఎస్ఏ సెంటర్
- ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ ప్రారంభం
- 06-03-2021 శనివారం.. మీ రాశి ఫలాలు
- నిరుద్యోగుల కోసం మొబైల్ కెరీర్ కౌన్సెలింగ్ ల్యాబ్
- రాష్ట్రంలో మూడురోజులు పొడి వాతావరణం.. పెరగనున్న ఎండలు
- నాణ్యమైన పరిశోధనలు జరగాలి: ప్రొఫెసర్ గోపాల్‌రెడ్డి
- బండ చెరువు నాలా పనులను జీహెచ్ఎంసీకి అప్పగించాలి
- రాజకీయ దురుద్దేశంతోనే ర్యాంకింగ్‌ను తగ్గించారు
- వృద్ధులకు గ్రౌండ్‌ఫ్లోర్‌లోనే టీకాలు వేయాలి
- బీజేపీ ద్వంద్వ విధానాల్ని ఎండగట్టాలి