సోమవారం 06 జూలై 2020
Gadwal - Jun 30, 2020 , 05:47:31

జూరాల ప్రాజెక్టులో 4.7 టీఎంసీల నీరు

జూరాల ప్రాజెక్టులో 4.7 టీఎంసీల నీరు

  • 857 క్యూసెక్కుల  ఇన్‌ఫ్లో నమోదు
  • గతేడాది కంటే నెల రోజులు ముందుగానే..
  • ఆల్మట్టి, నారాయణపూర్‌కు కొనసాగుతున్న వరద

జూరాల ప్రాజెక్టుకు వరద  ప్రారంభమైంది. సోమవారం 857 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదైంది. గతేడాది జూలై 28న నీటి రాక మొదలవగా.. కర్నాటక, తెలంగాణలో కురుస్తున్న వర్షాల కారణంగా ఈ సారి నెల రోజుల ముందుగానే షురూ అయ్యింది. ప్రాజెక్టు సామర్థ్యం 9.66 టీఎంసీలు కాగా ప్రస్తుతం 4.7 టీఎంసీల నీరు నిల్వ ఉన్నది. అవుట్‌ఫ్లో 105 క్యూసెక్కులుగా నమోదైంది. 

- జోగుళాంబ గద్వాల, నమస్తే తెలంగాణ 

 జూరాల ప్రాజెక్టుకు వరద ప్రారంభమైంది. సోమవారం 857 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదైంది. గతేడాది జూలై 28న ప్రారంభమైన వరద ఈ సారి నెల రోజుల ముందుగానే ప్రారంభమైంది. కర్ణాటక సరిహద్దుల్లో, తెలంగాణలో కురుస్తున్న వర్షాల కారణంగా వరద రాక మొదలైంది. జూరాల ప్రాజెక్ట్‌ సామర్థ్యం 9.66 టీఎంసీలుండగా ప్రస్తుతం ప్రాజెక్ట్‌లో 4.7 టీఎంసీల నీరు నిల్వ ఉన్నది. అవుట్‌ఫ్లో 105 క్యూసెక్కులుగా నమోదైంది. నెమ్మదిగా వరద వస్తుండటంతో రైతుల్లో సంతోషం వెల్లివిరిసింది. ప్రాజెక్ట్‌ నిండితే ఆయకట్టు కింద దాదాపు లక్ష ఎకరాల్లో పంటలు సాగుకానున్నాయి. ఎగువనున్న ఆల్మట్టి ప్రాజెక్ట్‌కు వారం రోజులుగా వరద కొనసాగుతూనే ఉంది. ప్రాజెక్ట్‌ పూర్తి సామ ర్థ్యం 129.72 టీఎంసీలుండగా ప్రస్తు తం ప్రాజెక్ట్‌లో 67.45టీఎంసీల నీరు నిల్వ ఉంది. తాజాగా ఇన్‌ఫ్లో 11,997 క్యూసెక్కులు, అవుట్‌ఫ్లో 1,130 క్యూసెక్కులు నమోదైంది. నారాయణపూర్‌ ప్రాజెక్ట్‌కు ఇన్‌ఫ్లో 947 క్యూసెక్కులు, అవుట్‌ ఫ్లో 36 క్యూసెక్కులుగా నమోదైంది. ప్రాజెక్ట్‌ పూర్తి స్థాయి నీటిమట్టం 37.64 టీఎంసీలుండగా ప్రస్తుతం 23.85 టీఎంసీల నీరు నిల్వ ఉన్నదని అధికారులు తెలిపారు.  


logo