ఆదివారం 28 ఫిబ్రవరి 2021
Gadwal - Jun 21, 2020 , 00:50:13

ఇసుక మాఫియాపై అధికారుల కొరడా

ఇసుక మాఫియాపై అధికారుల కొరడా

  • కోల్డ్‌ స్టోరేజ్‌ కేంద్రంగా ఇసుక దందా
  •  అధికారుల మెరుపు దాడులు
  • l 1,719 క్యూ.మీ ఇసుక స్వాధీనం
  •   గద్వాల అర్బన్‌:  జాతీయ రహదారిపై ఉండవెల్లి స్టేజీ సమీపం లో ఉన్న కోల్డ్‌ స్టోరేజ్‌  కేంద్రంగా ఈ ఇసుక దందా కొనసాగుతుంది. నిబంధనల మేరకే వే బ్రిడ్జ్‌ ద్వారా కొలతలు చేసిన తర్వాత వాహనంలో ఇసుకను తరలించాలి. ఒక వేళ పరిమితికి మించి వాహనంలో ఇసుక ఉంటే దానిని కోల్డ్‌ స్టోరేజ్‌ వద్దే నిల్వ చేసి దానిని ప్రభుత్వానికి అప్పగించాలి. ఇందుకు భిన్నంగా నిబంధనలకు తూట్లు పొడిచి కోల్డ్‌ స్టోరేజ్‌ నిర్వాహకులు తమ చేతి వాటం చూపడం ప్రారంభించారు. జిల్లా మైనింగ్‌ అధికారులకు ఈ విషయం తెలిసింది. దీంతో రంగంలోకి దిగిన అధికారులు పూర్తి సమాచారంతో శుక్రవారం ఎన్‌హెచ్‌ హైవే ఉండవెల్లి దగ్గర ఉన్న కోల్డ్‌ స్టోరేజ్‌ కేంద్రంపై మెరుపు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 1719 క్యూబిక్‌మీటర్ల ఇసుకను సీజ్‌ చేశారు.అధికారుల లెక్కల ప్రకారం (2800 టన్నుల) ఇసుక డంపు విలువ దాదాపు రూ.పది లక్షల పైగానే ఉండవచ్చని అంచనా వేశారు. హైవే పరిసర ప్రాంతలలో మరెక్కడైనా ఇసుక డంపులు ఉన్నాయా అని అధికారులు ఆరా తీస్తున్నారు. నిబంధనలు ఉల్లఘించి ఇసుక అక్రమ రవాణకు పాల్పడుతన్న వ్యక్తులపై నిఘా ఏర్పాటు చేస్తున్నామని జిల్లా మైనింగ్‌ అధికారి విజయరామరాజు తెలిపారు. ఇసుక అక్రమ నిల్వలు ఎక్కడైనా కనబడితే వెంటనే మైనింగ్‌ అధికారులకుగానీ పోలీసులకుగానీ సమాచారం అందించాలని ఆయన కోరారు.

VIDEOS

logo