శనివారం 27 ఫిబ్రవరి 2021
Gadwal - Jun 07, 2020 , 03:03:04

నకిలీ విత్తన విక్రయాలపై ఉక్కుపాదం

నకిలీ విత్తన విక్రయాలపై ఉక్కుపాదం

  • లూజు విత్తనాలు అమ్మితే చర్యలు
  • జోగుళాంబ గద్వాల ఎస్పీ రంజన్‌ రతన్‌కుమార్‌

జోగుళాంబ గద్వాల, నమస్తే తెలంగాణ : నకి లీ విత్తనాలను విక్రయించే వారిపై ఉక్కుపాదం మోపుతానని ఎస్పీ రంజన్‌ రతన్‌కుమార్‌ హెచ్చరించారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఎస్పీ శనివారం తన కార్యాలయంలో విలేకరుల తో మాట్లాడారు. లూజు, నకిలీ విత్తనాలను రవా ణా చేసినా, అమ్మినా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. రైతులు గుర్తింపు పొందిన విత్తనాల ను మాత్రమే కొనుగోలు చేయాలని సూచించారు. బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు ఆపరేషన్‌ స్మైల్‌, ఆపరేషన్‌ ముస్కాన్‌ కార్యక్రమాలను పక్కగా అమలు చేస్తామన్నారు. తల్లిదండ్రులకు అవగాహన కల్పించి ప్రతి చిన్నారి పాఠశాలకు వెళ్లేలా చూస్తామన్నారు. జిల్లా కేంద్రంలోని ట్రాఫిక్‌ సమస్యలను పరిష్కరించేందుకు ప్రధాన కూడళ్ల వద్ద సిగ్నల్స్‌ను ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఇందుకు సంబంధించిన నివేదికలను ఉన్నతాధికారులకు చేరవేస్తామన్నారు. చాలా కాలం తరువాత ఇక్కడ సేవలందించేందుకు అవకాశం రావడం సంతోషంగా ఉందన్నారు. సమావేశంలో ఏఎస్పీ కృష్ణ పాల్గొన్నారు. 

నకిలీ పత్తి విత్తనాల పట్టివేత

మక్తల్‌ రూరల్‌ : మక్తల్‌ మండలంలోని దాసరిదొడ్డి గ్రామానికి చెందిన రాం దాస్‌ ఇంట్లో ఏవో మిథున్‌ చక్రవర్తి ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు. అక్రమంగా నిల్వ ఉంచిన రూ.3.12 లక్షల విలువ చేసే 78 ప్యాకెట్ల పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకుని మూడు ప్యాకెట్లు శాంపిల్స్‌ కోసం పంపించినట్లు ఎస్సై అశోక్‌కుమార్‌ తెలిపారు. నిందితుడు పరారీలో ఉన్నాడని, అతనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. 

VIDEOS

logo