ఆదివారం 12 జూలై 2020
Gadwal - Jun 04, 2020 , 02:43:50

గ్రామాలు శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి

గ్రామాలు శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి

  •   పేదింటి ఆడపడుచులకు  కల్యాణలక్ష్మి వరం లాంటిది
  • ఎమ్మెల్యే ఆలవెంకటేశ్వర్‌రెడ్డి, కలెక్టర్‌ షేక్‌యాస్మిన్‌ బాషా

కొత్తకోట/మదనాపురం : గ్రామాలు పరిశుభ్రంగా ఉంటేనే ప్రజలు ఆరోగ్యంగా ఉంటారని, గ్రామాలన్నీ పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలని దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని పాలెం, రామానంతపురం గ్రామాల్లో కొనసాగుతున్న పల్లెప్రగతి పనులను కలెక్టర్‌ షేక్‌యాస్మిన్‌ బాషాతో కలిసి ఆయన పరిశీలించారు. అనంతరం కొత్తకోట మున్సిపల్‌ కేంద్రంలోని మండల పరిషత్‌ కార్యాలయంలో 47 మం ది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి చెక్కులను వారు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రతిఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు.

కొత్తకోట మండలంలో 47మంది లబ్ధిదారులకు, మదనాపురం మండలంలో 18 మందికి కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేయడం జరిగిందన్నారు. మదనాపురానికి చెంది న లక్ష్మమ్మ, నర్సింగాపురానికి చెందిన పెద్దగిరన్న, గోవిందహళ్లికి చెందిన చెంద్రయ్య అనే రైతులు ఇటీవల మృతి చెందడంతో వారి కుటుంబాలకు రూ.5లక్షల చొప్పున రైతుబీమా చెక్కులను ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి మదనాపురంలో అందజేశారు. కొత్తకోట మండలంలోని రా యిపేటకి చెందిన రాంచంద్రయ్య, మనెమ్మలకు సీఎం సహాయనిధి నుంచి మంజూరైన ఎల్‌వోసీ కాపీలను అందజేశారు. ఈ కార్యక్రమాల్లో జెడ్పీ వైస్‌ చైర్మన్‌ వామన్‌గౌడ్‌, ఎంపీపీ గుంతమౌనిక మల్లేశ్‌, ఉమ్మడి జిల్లా డీసీసీబీ డైరెక్టర్‌ కోట్టం వంశీచందర్‌రెడ్డి, సీడీసీ చైర్మన్‌ జగన్‌మోహన్‌రెడ్డి, ఉమ్మడి జిల్లా అధికారి ప్రతినిధి  ప్రశాంత్‌, మాజీ జెడ్పీటీసీ విశ్వేశ్వర్‌, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ జయమ్మ, మా జీ జెడ్పీటీసీ పీజే బాబు, సింగిల్‌విండో చైర్మన్‌ వాసుదేవారెడ్డి, ఎంపీపీ పద్మావతి, జెడ్పీటీసీ కృష్ణయ్య పాల్గొన్నారు. logo