మారుతున్న చెంచుల జీవనవిధానం

- రూ.3.3 కోట్లతో అభివృద్ధి పనులు
- 450 చెంచు గిరిజన కుటుంబాలకు లబ్ధి
- ఆర్డీటీ సంస్థ చేయూతతో మారుతున్న జీవనశైలి
నల్లమల అటవీ ప్రాంతంలోని చెంచుల జీవనం దుర్భరంగా మారింది.. జీసీసీలలో ఉత్పత్తుల కొనుగోలు లేక చెంచులకు పూట గడవని పరిస్థితి ఏర్పడింది.. ఈ క్రమంలో ఆర్డీటీ సంస్థ ముందుకు వచ్చింది.. వారి జీవితాలను అటవీ నుంచి వ్యవసాయం వైపు మళ్లించేందుకు అనేక మార్పులు తీసుకువచ్చింది. సాగుకుయోగ్యంగా లేని భూముల్లో పంటలు పండించేలా అవగాహన కల్పించి వారి జీవితాల్లో వెలుగును నింపుతున్నది. వ్యవసాయంతో పాటు అదనపు ఆదాయం సమకూర్చేలా ప్రోత్సహిస్తున్నది. లింగాల మండలంలో నాలుగు గ్రామాలను ఎంపిక చేసి అనేక పథకాలను ప్రవేశపెట్టింది. దాదాపు రూ.3.3 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టి 450 మంది కుటుంబాలకు లబ్ధి చేకూర్చింది. వారు అందిచిన సహకారంతో 1500 ఎకరాల్లో పంటలను సాగు చేస్తున్నారు.
- లింగాల
నల్లమల చెంచు పెంటల శివారులో రాళ్లు, రప్పల తో నిరుపయోగంగా ఉన్న పోడు భూములను వ్యవసాయ భూములుగా మార్చేందుకు ఆర్డీటీ సంస్థ కా ర్యాచరణ రూపొందించింది. చెంచు గిరిజనులతో వ్య వసాయం చేయించి వారి జీవితాల్లో మార్పు తీసుకువచ్చేందుకు ముందుకు సాగుతున్నది. వ్యవసాయ రం గంలో చెంచులను భాగస్వాములను చేస్తూ వచ్చే ఆదాయంతో కుటుంబాలను పోషించుకునేలా సదస్సులు పెట్టి వారిలో అవగాహన కల్పిస్తున్నది. సేంద్రియ సా గుతో సాగు చేసేలా వ్యవసాయాధికారులతో సమావేశాలు ఏర్పాటు చేయిస్తున్నారు. తక్కువ నీటితో పంట ను పండించుకునేలా తుంపర, బిందు సేద్యం పరికరాలను సైతం అందిస్తున్నారు. పాడి గేదెలు, ఆవులు, మేకలను అందించి చెంచుల ఆర్థికాభివృద్ధికి తోడ్పడు తున్నారు. నాటు కోళ్ల పెంపకం, పండ్ల తోటల పెంప కం, బయోగ్యాస్ ప్లాంట్లను కూడా ఏర్పాటు చేయిం చారు. వ్యవసాయానికి ప్రత్యేకంగా ఒక విభాగాన్ని ఏ ర్పాటు చేసి చెంచు రైతులకు సలహాలు, సూచనలు ఇ స్తున్నారు. భూగర్భజలాల పెంపునకు నీటి కొలనులు తవ్వించారు. పొగరాని పొయ్యిల ఏర్పాటుకు ఆర్థిక సాయాన్ని అందించారు. ఇలా లింగాల మండలంలో ఎంపిక చేసిన ఐదు గ్రామాల్లో (కొత్తకుంటపల్లి, శా యిన్పేట, పాత రాయవరం, రాయవరం) అనేక పథ కాలను ప్రవేశపెట్టింది.
ఆర్డీటీ సంస్థ చేసిన పనులు..
- కొత్తకుంటపల్లి గ్రామంలో 84 చెంచు కుటుంబాలతో పాటు ఆర్థికంగా వెనుకబడిన సామాజిక వర్గాల వారికి తుంపర సేద్యం పరికరాలను అందజేశారు.
- ఒక్కో రైతుకు రూ.21 వేల చొప్పున మొత్తం రూ.84 లక్షలు వ్యయం చేశారు.
- 58 మంది రైతులకు రూ.23.20 లక్షల విలువ చేసే పాడి గేదెలను కొనుగోలు చేసి ఇచ్చారు.
- 135 కుటుంబాలకు రూ.75వేల వ్యయంతో పొయ్యిలను అందించారు.
- రూ.5.60 లక్షలతో బిందు సేద్యం పరికరాలను అందించారు.
- 15 ఎకరాల్లో పండ్ల తోటల పెంపకానికి రూ.2.17 లక్షలు ఖర్చు చేశారు.
- ఆర్థికంగా వెనకబడిన పది కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.30 వేల ఖర్చుతో బయోగ్యాస్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయించారు.
- పాతరాయవరం గ్రామంలో 33 మంది రైతులకు రూ.6.93 లక్షలతో తుంపర సేద్యం పరికరాలను అందజేశారు.
- గ్రామ శివారులోని చీకటి వాగుకు అడ్డంగా రూ.28 లక్షలతో చెక్‌డ్యాంను నిర్మించారు. నీటికి అడ్డుకట్ట వేయడం ద్వారా భూగర్భజలాలు పెరిగాయి.
- రాయవరం గ్రామంలో 36 మంది రైతులకు రూ.76.56 లక్షల విలువ చేసి తుంపర సేద్యం పరికరాలను పంపిణీ చేశారు.
- పండ్ల తోటల పెంపకం కోసం ఆర్డీటీ సంస్థ ఆర్ధిక సాయాన్ని అందిస్తున్నది.
- శాయిన్‌పేట గ్రామంలో 94 మంది రైతులకు రూ.19.74 లక్షల విలువ చేసే తుంపర సేద్యం పరికరాలను అందజేశారు.
- ఎంజీకేఎల్ఐ కాల్వల ద్వారా వచ్చే సాగునీటికి తుంపర పరికరాలను ఉపయోగిస్తూ రబీలో 180 ఎకరాల్లో చెంచులు వేరుశనగ సాగు చేశారు.
ఐదెకరాల భూమి సాగులోకి..
ఆర్డీటీ సంస్థ సహకారంతో ఐదెకరాల భూమి సాగులోకి వచ్చింది. రెండేళ్ల నుంచి వానకాలం, యాసంగిలో పంటలు సాగు చేస్తున్నాను. సుమారు రూ.8 లక్షల మేర పంట పండించాను. ప్రస్తుతం వేరుశనగ పంట వేశాను. ఆర్డీటీ సంస్థ సహకారంతో వ్యవసాయంపై ఆధారపడి జీవనం కొనసాగిస్తున్నాం.
- గద్వాల బాలస్వామి, రైతు, శాయిన్‌పేట
చెంచులను ఆదుకోవడమే లక్ష్యం..
నల్లమలలో అటవీ ఉత్పత్తుల లభ్య త తగ్గిపోతున్నది. దీంతో చెంచుల జీ వనం దుర్భరంగా మారింది. జీసీసీల లో ఉత్పత్తుల కొనుగోలు లేక చెంచుల కు పూట గడవని పరిస్థితి ఏర్పడింది. వారి దృష్టి అటవీ ఉత్పత్తుల నుంచి వ్యవసాయం వైపు మళ్లించి శాశ్వతం గా ఉపాధి కల్పించాలన్నదే సంస్థ ఉద్ధేశం. భూములను అభివృద్ధి చేసి సాగుయోగ్యంగా మార్చడంతో పాటు అదనపు ఆ దాయం కోసం పాడి గేదెలు, ఆవులు, కోళ్లను అందిస్తున్నాం.
- కే వెంకటేశ్వర్లు, ఆర్డీటీ సంస్థ ఎకాలజి, అచ్చంపేట
తాజావార్తలు
- ఖిల్లా మైసమ్మ జాతర ప్రారంభం
- వైకుంఠధామాన్ని 15లోపు పూర్తి చేయాలి
- నయనానందకరం
- ఆ పల్లెలు.. ప్రగతికి దూరం
- స్వచ్ఛ సర్వేక్షణ్‌లో ర్యాంక్ సాధిద్దాం
- కొనసాగుతున్న టీఆర్ఎస్ సభ్యత్వ నమోదు
- విద్యార్థినికి ఎమ్మెల్యే ఆర్థిక సాయం
- రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
- వామన్‌రావు హత్య కేసు సీబీఐకి ఇవ్వండి
- మహిళా దినోత్సవం నిర్వహణకు కమిటీ