శనివారం 11 జూలై 2020
Gadwal - May 29, 2020 , 03:24:09

ఆలయ భూములను కాపాడుతాం

ఆలయ భూములను కాపాడుతాం

 మక్తల్‌ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి 

మక్తల్‌ టౌన్‌ : ఆలయ భూములను కాపాడుకుంటున్నామని మక్తల్‌ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి అన్నారు. గురువారం మక్తల్‌ పట్టణంలోని ఎమ్మెల్యే నివాసంలో ఆలయ పరిరక్షణ సమితి సభ్యులు, బజరంగ్‌దళ్‌, విశ్వహిందూ పరిషత్‌ సభ్యులు ఎమ్మెల్యే చిట్టెంను కలిసి ఆలయ భూములను కాపాడాలని వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పడమటి ఆంజనేయస్వామి ఆలయ భూములను పరిరక్షిస్తున్నామని, జాతర సందర్భంగా దర్శనానికి వచ్చే వేలాది మంది భక్తుల సౌకర్యార్థం దుకాణాల ఏర్పాటు, భక్తుల విడిదికి, ఆధ్యాత్మిక కార్యక్రమాల కోసం ఉపయోగపడేలా ఆలయ భూములను కాపాడుకుంటామన్నారు. వాటర్‌ ట్యాంక్‌ దగ్గర గల ఆలయ స్థలాన్ని, సర్వే నెంబర్‌ 35లోని 8 ఎకరాల 24 గుంటల భూమిని సర్వే చేయించి జాతర ఉత్సవాలకు  ఉపయోగించుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ పరిరక్షణ సమితి అధ్యక్షుడు కావలి వెంకటేశ్‌, కే సత్యనారాయణ, విశ్వహిందు పరిషత్‌ జిల్లా సహాయ కార్యదర్శి భీం రెడ్డి, బజరంగ్‌దళ్‌ సభ్యులు భాస్కర్‌రెడ్డి, భీమేశ్‌, గోపాల్‌, కృష్ణమూర్తి పాల్గొన్నారు. logo