శనివారం 11 జూలై 2020
Gadwal - May 29, 2020 , 03:14:55

కరోనాతో మరొకరు మృతి

కరోనాతో మరొకరు మృతి

చికిత్స పొందుతూ కొండారెడ్డిపల్లికి చెందిన వ్యక్తి మృతి

 గ్రామానికి రాకపోకలు నిషేధించిన అధికారులు

హోంక్వారంటైన్‌లో జక్లేర్‌, రుద్రసముద్రం,   పారేవులకు చెందిన 63 మంది

కరోనా పాజిటివ్‌ వ్యక్తి మృతి

వంగూరు: వంగూరు మండలంలోని కొండారెడ్డిపల్లి గ్రామంలో కరోనా పాజిటివ్‌ వచ్చిన వ్యక్తి హైదరాబాద్‌లోని యశోద దవాఖానలో చికిత్స పొందుతూ గురువారం తెల్లవారుజామున మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. వివరాల్లోకి వెళితే.. వంగూరు మండలం కొండారెడ్డిపల్లి గ్రామానికి చెందిన వ్యక్తికి ఈనెల 27 కరోనా సోకిందని వైద్యులు నిర్ధారించారు. అంత్యక్రియలు హైదరాబాద్‌లో నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. కాగా కొండారెడ్డిపల్లి గ్రామాన్ని పోలీసులు ఆధీనంలోకి తీసుకున్నారు. డీఎస్పీ గిరిబాబు సందర్శించి గ్రామస్తులకు సలహాలు, సూచనలు అందించారు. గ్రామంలోకి ఎవరూ కొత్తవారు రాకుండా చర్యలు తీసుకున్నారు. గురువారం నాలుగు వైద్య బృందాలు 654 మందికి థర్మో స్క్రీనింగ్‌ చేశారు. ప్రైమరీ కాంటాక్టు వ్యక్తులకు స్టాంపులు వేశారు. పాజిటివ్‌ వ్యక్తి కుటుంబ సభ్యుల బ్లడ్‌ శాంపిల్స్‌ పరీక్షల నిమిత్తం హైదరాబాద్‌కు పంపించినట్లు హెల్త్‌ అసిస్టెంట్‌ మేషక్‌ తెలిపారు. గుంటూరు నుంచి తమ సొంత గ్రామమైన వంగూరుకు తిరిగొచ్చిన 8మంది వలస కూలీలను గ్రామంలోని హాస్టల్లో క్వారంటైన్‌ చేశారు. 


logo