శనివారం 11 జూలై 2020
Gadwal - May 29, 2020 , 03:14:54

సాహిత్య జ్యోతి

సాహిత్య జ్యోతి

వృత్తి ఉపాధ్యాయురాలు, ప్రవృత్తి కవితారచన 

జాతీయస్థాయిలో అవార్డులు అందుకున్న కవయిత్రి సాయిజ్యోతి

బల్మూరు: ఆమె రచనలకు, కవితలకు జాతీయస్థాయిలో అవార్డులు, ప్రశంసలు పొంది రాష్ర్టానికి, నల్లమలకు పేరు ప్రఖ్యాతలు తెచ్చింది.. కవయిత్రి సాయిజ్యోతి. వృత్తి ఉపాధ్యాయురాలు.. ప్రవృత్తి రచనలు, కవితలు రాయడం. పెద్దకొత్తపల్లికి చెందిన పోల సుశీలమ్మ, బాలస్వామి కూతురు సాయిజ్యోతి. ఆమె భర్త ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఉమామహేశ్వర్‌ ప్రోత్సాహంతో వివిధ పోటీ పరీక్షల్లో పాల్గొని ఎంఏ తెలుగు, ఎంకామ్‌, బీఈడీ పూర్తి చేసింది. అనతి కాలంలోనే ఉపాధ్యాయు రాలిగా ఉద్యోగం వచ్చింది. కవితలు, రచనలపై ఆసక్తి ఉండ టంతో కవి సమ్మేళనంలో పాల్గొనడం, పుస్తకాలు రాయడం, టీవీ షోలో పాల్గొన్నది. 2017లో టీఆర్‌ ఎస్‌ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రపంచ తెలుగు మహాసభల్లో పాల్గొనడంతో తన ప్రతిభ వెలుగులోకి వచ్చింది. అనంతరం డాక్టరేట్‌ అందుకున్నారు. 2018లో స్త్రీశక్తి, రాష్ట్రస్థాయిలో అవార్డు, జాతీయ స్థాయిలో న్యూఢిల్లీలో సేవా భారతి అవార్డు అందు కున్నారు. 2019లో డాక్ట రేట్‌, స్ఫూర్తిరత్న, సాహిత్య జ్యోతి, వాగ్దేవి బిరుదు, ఉత్తమ కవయిత్రిగా పుర స్కారం అందుకున్నారు. 2018లో వండర్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌, 2019లో తెలుగు బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ రాశారు. ఆమె ప్రశంసలు, అవార్డులతో నల్లమల ప్రాంతానికి మంచి గుర్తింపు వచ్చిందని స్థానికులు చెబుతున్నారు. ప్రస్తుతం సాయిజ్యోతి గట్టుతుమ్మెన్‌ పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయురాలిగా విధులు నిర్వహిస్తున్నారు.  


logo