శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
Gadwal - May 27, 2020 , 02:00:37

చెట్టు నరికినందుకు రూ.5 వేల జరిమానా

చెట్టు నరికినందుకు రూ.5 వేల జరిమానా

లింగాల : గ్రామపంచాయతీ అనుమతులు లేకుండా ఇంటి ఆవరణలోని చెట్టును నరికినందుకు యజమానికి రూ.5వేల జరిమానా విధించారు. మండల కేంద్రానికి చెం దిన నిర్మల నెమలి చెట్టును మంగళవారం నరికివేయించింది. విషయం తెలుసుకున్న సర్పంచ్‌ తిరుపతయ్య రూ.5 వేల జరిమానా విధించాడు. నిర్మల భర్త హరిలాల్‌ గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఫైన్‌ కట్టి రశీదును తీసుకున్నారు. అనుమతుల్లేకుండా చెట్లను నరికితే చట్టపరమైన చర్యలు ఉంటాయని సర్పంచ్‌ హెచ్చరించారు. కార్యక్రమంలో సింగిల్‌ విండో డైరెక్టర్‌ శంకర్‌నాయక్‌, వార్డు సభ్యుడు శ్రీనివాసులు, టీఆర్‌ఎ స్‌ నాయకులు హన్మంతునాయక్‌, ప్రణయ్‌ పాల్గొన్నారు.

VIDEOS

logo