మంగళవారం 26 మే 2020
Gadwal - May 23, 2020 , 03:26:10

గుప్త నిధుల కోసం తవ్వకాలు

గుప్త నిధుల కోసం తవ్వకాలు

శివలింగాన్ని పెకిలించిన దుండగులు

 పునఃప్రతిష్ఠించి పూజలు   చేసిన గ్రామస్తులు

 జోగుళాంబ గద్వాల జిల్లా  పూడూరులో ఘటన

గద్వాల అర్బన్‌ : గుప్త నిధుల కోసం గుర్తు తెలియని వ్యక్తులు తవ్వకాలు జరిపిన ఘటన గద్వాల జిల్లాలో చోటు చేసుకున్నది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పూడూరు గ్రామ శివారులోని బక్కమ్మ చెరువు వద్ద ఉన్న పురాతన శివలింగం వద్ద శుక్రవారం తెల్లవారుజామున గుర్తు తెలియని వ్యక్తులు గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిపారు. అమావాస్య ఉండటంతో పూజలు నిర్వ హించిన ఆనవాళ్లు ఉన్నాయి. సమాచారం తెలుసుకున్న రూరల్‌ ఎస్సై శ్రీకాంత్‌రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. ప్రత్యేక బృ ందాలతో గాలిస్తున్నట్లు చెప్పారు.  అనంతరం సర్ప ంచ్‌ ఆధ్వర్యంలో శివలింగాన్ని యథాస్థానంలో ప్రతిష్ఠించి అభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. logo