శనివారం 06 జూన్ 2020
Gadwal - May 14, 2020 , 02:45:45

భూ నిర్వాసితులకు న్యాయం చేస్తాం

భూ నిర్వాసితులకు న్యాయం చేస్తాం

  • ఎమ్మెల్యే చిట్టెం

ఊట్కూర్‌/మక్తల్‌ రూరల్‌ : కరోనా వ్యాప్తిని అరికట్టడానికి లాక్‌డౌన్‌తో నిమిత్తం లేకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి అన్నారు. బుధవారం మండల కేంద్రంలో పీఆర్‌టీయూ మండల అధ్యక్షుడు లక్ష్మారెడ్డి అధ్యక్షతన వివిధ పాఠశాలల్లో పనిచేస్తున్న స్వీపర్లు, స్కావెంజర్లతోపాటు 100 పేద కుటుంబాలకు ఐదు కిలోల బియ్యం, కిలో నూనె, కారం, పప్పు కిట్‌లను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. మక్తల్‌ మండలంలోని తిర్లాపురం శివారులో మునీరాబాద్‌, కృష్ణ రైల్వేలైన్‌ నిర్మాణంలో భూములు కోల్పోయిన రైతులకు నష్టపరిహారం అందకపోవడంతో రైతులు రైల్వేలైన్‌ పనులను అడ్డుకున్నారు. రెండేండ్లయినా నష్టపరిహారం రాలేదని ఆందోళనకు దిగారు. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి అక్కడికి వెళ్లి రైతులు, రైల్వే అధికారులతో మాట్లాడారు. తిర్లాపురం గ్రామానికి చెందిన సోమప్ప, కుర్వలింగప్ప, చిన్నమొగులప్ప, పెద్ద మొగులప్ప అనే రైతులు భూములు కోల్పోయారని, వీరికి నష్టపరిహారం చెల్లించాల్సి ఉందన్నారు. ఈ మేరకు ఎమ్మెల్యే చిట్టెం ఫోన్‌లో నారాయణపేట ఆర్డీవో శ్రీనివాసులుతో మాట్లాడి రైతులకు వెంటనే నష్టపరిహారం చెల్లించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ సూర్యప్రకాశ్‌రెడ్డి, పీఏసీసీఎస్‌ మాజీ అధ్యక్షుడు నారాయణరెడ్డి, మాజీ ఎంపీటీసీ గోవిందప్ప, ఎంఈవో వెంకటయ్య, పీఆర్‌టీయూ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు తిమ్మారెడ్డి, జనార్దన్‌రెడ్డి, సంతోష్‌కుమార్‌, నర్సింహారెడ్డి, లక్ష్మారెడ్డి, శ్రీనివాసులు, భాస్కర్‌, గురునాథ్‌, జగన్నాథ్‌రావు, సత్యపాల్‌ తదితరులు పాల్గొన్నారు.


logo