మంగళవారం 02 మార్చి 2021
Gadwal - May 12, 2020 , 02:07:59

పుల్లూర్‌ చెక్‌పోస్టు తనిఖీ

పుల్లూర్‌ చెక్‌పోస్టు తనిఖీ

గద్వాల/ఉండవల్లి : రాష్ట్ర సరిహద్దు చెక్‌పోస్ట్‌ పుల్లూరు టోల్‌గేట్‌ను జోగుళాంబ గద్వాల జెడ్పీ చైర్‌పర్సన్‌ సరిత, ఇన్‌చార్జి ఎస్పీ అపూర్వరావు సోమవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి ఏర్పాటు చేసిన అన్నదానంలో జెడ్పీ చైర్‌పర్సన్‌ పాల్గొని టోల్‌ప్లాజా వద్ద విధులు ని ర్వహిస్తున్న వివిధ శాఖల అధికారులకు భోజనం వడ్డించారు. ఎస్పీ అపూర్వరావు వలస కార్మికులకు సంబంధించిన రిజిస్టర్‌ను పరిశీలించి వాహనాలు, వ్యక్తులను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వా తే రాష్ట్రంలోకి అనుమతించాలని అధికారులకు సూచించారు. 

అనంతరం జిల్లా కేంద్రంలోని దవాఖానను జెడ్పీ చైర్‌పర్సన్‌ తనిఖీ చేసి రోగులకు అందుతున్న వైద్యం గురించి దవాఖాన సూపరింటెండెంట్‌ శోభారాణిని అడిగి తెలుసుకున్నారు. జిల్లా దవాఖానకు వచ్చే రోగులకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. దవాఖానలో ఏవైనా సమస్యలు ఉంటే తమ దృ ష్టికి తీసుకువస్తే కలెక్టర్‌, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానని తెలిపారు. డెలివరీ కోసం వచ్చిన గర్భిణులకు పూర్తి స్థాయిలో వైద్యం అందించాలన్నారు.

VIDEOS

logo