ప్రతిపక్షాలు చిల్లర రాజకీయాలు మానుకోవాలి

- దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి
కొత్తకోట/మదనాపురం/దేవరకద్ర రూరల్/భూత్పూర్ : కరోనా కట్టడికి లాక్డౌన్ కాలంలో సీఎం కేసీఆర్ ప్రజల సంక్షేమం కోసం గొప్ప పనులు చేస్తున్నారని, ప్రతిపక్షాలు చిల్లర రాజకీయాలు మానుకోవాలని దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి అన్నారు. శనివారం మాజీ జెడ్పీటీసీ పొగాకు విశ్వేశ్వర్ ఆధ్వర్యంలో కొత్తకోట, మదనాపురం మండలాల్లోని 52 మంది ఫొటోగ్రాఫర్లకు కొత్తకోటలోని భవానీ థియేటర్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. 6వ వార్డు కౌన్సిలర్ సంధ్య రవీందర్‌రెడ్డి పెండ్లిరోజు, ఎస్సై నాగశేఖర్‌రెడ్డి పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి అభినందనలు తెలిపారు. ఇతర రాష్ర్టాలలో నియోజకవర్గానికి చెందిన వలస కూలీల కోసం మండల నాయకులతో కలిసి ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయగా మాజీ జెడ్పీటీసీ పీజే బాబు రూ.20వేల చెక్కును ఎమ్మెల్యేకు అందజేశారు. ఈ మేరకు పీజే బాబుకు ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు. అంతకుముందు కొత్తకోట మున్సిపల్ కేంద్రంలో జరుగుతున్న రోడ్డు విస్తరణ పనులను ఎమ్మెల్యే పరిశీలించారు. అనంతరం మదనాపురం మండలంలోని శంకరమ్మపేట గ్రామ సమీపంలో ఉన్న సరళాసాగర్ ఆనకట్ట పనులను ఆయన పరిశీలించారు. పనులు త్వరగా పూర్తిచేసి వానాకాలం పంటలకు సాగునీరు అందిస్తామన్నారు. దేవరకద్ర మండలంలోని డోకూరు కేజీబీవీ క్వారంటైన్లో వలసకూలీలకు ఎమ్మెల్యే ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఎమ్మెల్యే సూచనల మేరకు వారికి ఎంపీపీ రమాశ్రీకాంత్యాదవ్ బస్సుచార్జీల నిమిత్తం రూ.15 వేలు ఇచ్చారు. భూత్పూర్ మండలంలో ముగ్గురికి మంజూరైన రైతుబీమా చెక్కులను ఎమ్మెల్యే ఆల పంపిణీ చేశారు. ఆయా కార్యక్రమాల్లో మున్సిపల్ చైర్మన్ బస్వరాజ్‌గౌడ్, సత్యనారాయణ, నర్సింహాగౌడ్, జెడ్పీ వైస్ చైర్మన్ వామన్‌గౌడ్, ఎంపీపీలు గుంతమౌనిక మల్లేశ్, జున్ను పద్మావతి, జెడ్పీటీసీ కృష్ణయ్య, డీసీసీబీ డైరెక్టర్ వంశీచందర్‌రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ జయమ్మ, ఉమ్మడి జిల్లాల అధికార ప్రతినిధి గాడిల ప్రశాంత్ పాల్గొన్నారు.
తాజావార్తలు
- ఆర్టీసీ బస్సుకు తప్పిన ప్రమాదం
- నాలుగో టెస్ట్‌కూ అదే పిచ్ ఇవ్వండి
- ఆప్‌లో చేరిన అందగత్తె మాన్సీ సెహగల్
- తాటి ముంజ తిన్న రాహుల్ గాంధీ..
- కేంద్ర హోంమంత్రి అమిత్ షా తిరుపతి పర్యటన రద్దు
- వెండితెరపై సందడి చేయనున్న బీజేపీ ఎమ్మేల్యే..!
- కేంద్రానికి తమిళ సంస్కృతిపై గౌరవం లేదు: రాహుల్‌గాంధీ
- ఎయిర్పోర్ట్ లాంజ్‌లో బైఠాయించిన చంద్రబాబు.. వీడియో
- అవును.. ఐపీఎల్‌కు మేం రెడీగా ఉన్నాం: అజారుద్దీన్
- ఆనంద్ దేవరకొండ మూడో సినిమా ఫస్ట్ లుక్ వచ్చేసింది..!