ఆదివారం 07 మార్చి 2021
Gadwal - May 07, 2020 , 02:22:24

కరోనా వైరస్‌పై అప్రమత్తంగా ఉండాలి

కరోనా వైరస్‌పై అప్రమత్తంగా ఉండాలి

  • అలంపూర్‌ ఎమ్మెల్యే అబ్రహం 

అలంపూర్‌, నమస్తే తెలంగాణ/అయిజ: కంటైన్మెంట్‌ జోన్లలోని ప్రజలు కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు తీసుకుంటూ అప్రమత్తంగా ఉండాలని అలంపూర్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ వీఎం అబ్రహం అన్నారు. బుధవారం అలంపూర్‌ మండలంలోని లింగనవాయి, అయిజ మండలంలోని మూగోనిపల్లి గ్రామాల్లో పర్యటించి కరోనా బాధితుల ఇండ్లను పరిశీలించారు. టీఆర్‌ఎస్‌ నాయకుడు వల్లూరు కిశోర్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో ఎమ్మెల్యే అబ్రహం పాల్గొని ఏపీ, తెలంగాణ సరిహద్దు ప్రాంతంలో పుల్లూరు చెక్‌పోస్టు వద్ద పోలీసులకు ఇతర శాఖల సిబ్బందికి భోజనం వడ్డించారు. ఈ కార్యక్రమంలో తాసిల్దార్‌ మదన్‌మోహన్‌, ఎంపీటీసీ జ్యోతి, పంచాయతీ కార్యదర్శి మహేశ్‌ పాల్గొన్నారు.

VIDEOS

logo