శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
Gadwal - May 06, 2020 , 02:17:19

నిర్లక్ష్యం వద్దు

నిర్లక్ష్యం వద్దు

  • స్వీయ నిర్బంధమే రక్ష 
  • పాలమూరులో అప్రమత్తం
  • గద్వాలలో ఇంటి వద్దకే వైద్య సేవలు
  • వనపర్తిలో నిబంధనల కొనసాగింపు 

మహబూబ్‌నగర్‌, నమస్తే తెలంగాణ : జిల్లాలో కంటైన్మెంట్‌ పరిధిని పూర్తి స్థాయిలో తొలగించినప్పటికి కొత్తగా కరోనా కేసులు నమోదు కాకుండా ఎవరికి వారు స్వీయ నిర్బంధం చేసుకోవాలని అధికారులు, ప్రజా ప్రతినిధులు పేర్కొంటున్నారు. జి ల్లా వ్యాప్తంగా ఉదయం 7 గంటల నుంచి సాయం త్రం 6 గంటల వరకు నిత్యావసర సరుకుల దుకాణాలు ప్రజలకు అందుబాటులో ఉంచాలని ప్రభు త్వం నిర్ణయించింది. ఈ మేరకు కరోనా నివారణ చర్యలను జిల్లా వ్యాప్తంగా అధికారులు, పోలీసు లు,వైద్యసిబ్బంది పకడ్బందీగా అమలు చేస్తున్నారు. 

వలస కూలీలకు రేషన్‌ బియ్యం

జోగుళాంబ గద్వాల ప్రతినిధి, నమస్తేతెలంగాణ : ఇతర రాష్ర్టాల నుంచి వచ్చిన వలస కూలీలకు రేషన్‌ కార్డు ఉంటే బియ్యం, సరుకులు అందించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. అందుబాటులో ఉన్న రేషన్‌ దుకాణంలో బియ్యం తీసుకునేలా ఏర్పాట్లు చేస్తున్నారు. కంటైన్మెంట్‌ ఏరియా ల్లో హోం క్వారంటైన్‌లో ఉన్న వారికి వైద్యాధికారులు ఇంటివద్దకే వెళ్లి వైద్యమందిస్తున్నారు. వైద్య సిబ్బంది ప్రతిరోజూ అన్ని వీధుల్లో పర్యటించి కరో నా లక్షణాలున్న వారిని గుర్తిస్తున్నారు. వ్యాధి లక్షణాలను బట్టి రోగులకు చికిత్స అందిస్తున్నారు. ఎవరికైనా జలుబు, దగ్గు, జ్వరం వంటి లక్షణాలు ఉంటే వెంటనే వైద్య సిబ్బందిని సంప్రదించి చికిత్స చేయించుకోవాలని కలెక్టర్‌ శ్రుతి ఓఝా సూచించారు.  

పకడ్బందీగా లాక్‌డౌన్‌

నాగర్‌కర్నూల్‌ ప్రతినిధి, నమస్తే తెలంగాణ : జిల్లా లో లాక్‌డౌన్‌ పకడ్బందీగా అమలవుతోం ది. ప్రజ లు ఇండ్లకే పరిమితమయ్యారు. గత నెల 3వ తేదీ తర్వాత కేసులు నమోదుకాక పోవడంతో ప్రజలు, అధికారు లు ఊపిరి పీల్చుకుంటున్నారు. కేవలం నిత్యావసర సరుకులు, కూరగాయల కోసం మాత్ర మే ప్రజలు బయటకు వస్తున్నారు. కలెక్టర్‌ శ్రీధర్‌, ఎస్పీ సాయిశేఖర్‌ల పర్యవేక్షణలో జిల్లాలో లాక్‌డౌన్‌ ప్రశాంతంగా కొనసాగుతోంది.

 కఠినంగా లాక్‌డౌన్‌ అమలు

వనపర్తి ప్రతినిధి, నమస్తే తెలంగాణ : జిల్లాలో మ రింత కఠినంగా లాక్‌డౌన్‌ను అధికారులు అమలు చేస్తున్నారు. నిబంధనల అమలులో ఏమాత్రం రా జీ లేకుండా పోలీసులు విధులు నిర్వహిస్తున్నారు. కలెక్టర్‌ షేక్‌ యాస్మిన్‌ బాషా, ఎస్పీ అపూర్వరావుల ఆదేశాల మేరకు జిల్లా అధికార యంత్రాంగం పకడ్బందీగా పని చేస్తోంది. జిల్లాలో కరోనా పాజిటివ్‌ కేసులు లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవడంతో రాష్ట్ర స్థాయిలో జిల్లాకు గుర్తింపు వచ్చింది. ఇదే వాతావరణాన్ని కొనసాగించేందుకు అధికారులు అన్ని విధాలా చర్యలు తీసుకుంటున్నారు. 

ఇతర రాష్ర్టాలకు వెళ్లేందుకు అనుమతి

నారాయణ పేట ప్రతినిధి నమస్తే తెలంగాణ : ఇతర రాష్ర్టాల నుంచి వలస వచ్చిన కూలీలు వారి వారి రాష్ర్టాలకు వెళ్లేందుకు జిల్లా అధికార యంత్రాంగం అవకాశాలు కల్పిస్తున్నది. ఆయా మండలాల పరిధి లోని పోలీస్‌స్టేషన్లలో వివరాలు తెలిపి అనుమతి పొందేలా ఎస్పీ చేతన ఆదేశాలు జారీ చేశారు. కర్ణాటక సరిహద్దులో ఉన్న గ్రామాలపై  పోలీస్‌ యం త్రాంగం ప్రత్యేక దృష్టిని సారించి పర్యవేక్షిస్తున్నది. కలెక్టర్‌ హరిచందన ఆయా మండలాల అధికారులతో మాట్లాడుతూ సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. 

VIDEOS

logo