మంగళవారం 14 జూలై 2020
Gadwal - Apr 27, 2020 , 02:07:47

ఘనంగా బసవ జయంతి

ఘనంగా బసవ జయంతి

ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా నెట్‌వర్క్‌, నమస్తే తెలంగాణ : ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో బసవేశ్వర జయంతి వేడుకలను ఆదివారం వైభవంగా నిర్వహించుకున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలతో పాటు వీరశైవ సంఘం ఆధ్వర్యం లో ఈ వేడుకలను చేపట్టారు. జడ్చర్ల తాసిల్దార్‌ కార్యాలయం లో నిర్వహించిన వేడుకలకు ముఖ్యఅథితిగా రాష్ట్ర సంగీత, నాటక అకాడమీ చైర్మన్‌ బాద్మి శివకుమార్‌ పాల్గొని పూలమాలలు వేసి నివాళులర్పించారు. స్థానిక నేతాజీ చౌక్‌లో వీరశైవ లింగాయత్‌ సమాజం ఆధ్వర్యంలో నివాళులర్పించి ప్రజలకు  మాస్కులు, అరటిపండ్లు పంపిణీ చేశారు. వనపర్తి మండలం చిట్యాల శివారులోని చేయూత ఆశ్రమంలో వీరశైవ సంఘం సభ్యురాలు రేణుకదేవి చిన్నారులకు నిత్యావసర సరుకులు అందజేశారు. ఖిల్లాఘణపురం మండల కేంద్రంలోని బస్టాండ్‌ ఆవరణలో సామాజిక కార్యకర్త గోపి ఆధ్వర్యంలో, కోస్గి మున్సిపాలిటీ కార్యాలయంలో చైర్‌పర్సన్‌ శిరీష, వైస్‌ చైర్‌పర్సన్‌ అన్నపూర్ణలు బసవేశ్వరుడి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. మద్దూరు తాసిల్దార్‌ కార్యాలయంలో వీరశైవ లింగాయత్‌ సంఘం ఆధ్వర్యంలో పీఏసీసీఎస్‌ చైర్మన్‌ జగదీశ్‌, ఆర్‌ఐ అమరేందర్‌, మల్దకల్‌ మండలంలోని ఎల్కూర్‌లో శ్రీకాంత్‌ స్వామి ఆధ్వర్యంలో, దామరగిద్ద మండలం తాసిల్దార్‌ ఎంపీడీవో, గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో జరిగిన వేడుకల్లో ఎంపీపీ బక్క నర్సప్ప, ఎంపీడీవో సందీప్‌కుమార్‌, సర్పంచ్‌ వన్నడి ఆశమ్మ ఆధ్వర్యంలో ఘన నివాళులర్పించా రు. గట్టు పీఏసీసీఎస్‌ కార్యాలయంలో వీరశైవ యువజన వి భాగం ఆధ్వర్యంలో పీఏసీసీఎస్‌ చైర్మన్‌ క్యామ వెంకటేశ్‌, రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షుడు రామకృష్ణారెడ్డి ఘన నివాళులర్పించారు. కొత్తకోటలోని అంబా భవానీ ఆలయంలో ఎం పీపీ గుంత మౌనికమల్లేశ్‌ దంపతుల ఆధ్వర్యంలో జెడ్పీ వైస్‌చైర్మన్‌ వామన్‌గౌడ్‌, మాజీ జెడ్పీటీసీ విశ్వేశ్వర్‌ నివాళులర్పించి అన్నదానం చేశారు. మక్తల్‌లోని మల్లికార్జున స్వామి దేవాలయంలో వీరశైవ సంఘం నాయకులు డీ బస్వరాజ్‌ నివాళి అర్పించి పూజలు చేశారు. కృష్ణ మండల కేంద్రంతో పాటు హిందూపూర్‌, చేగుంట, గుడేబల్లూర్‌, మురహరిదొడ్డి, ఖాన్‌దొడ్డి గ్రామాల్లో సర్పంచులు, వీరశైవ లింగాయత్‌ సం ఘాల ఆధ్వర్యంలో బసవేశ్వరునికి నివాళి అర్పించారు. ఊ ట్కూర్‌ మండల పరిషత్‌ కార్యాలయంలో ఎంపీపీ ఎల్కోటి లక్ష్మీనారాయణరెడ్డి ఆధ్వర్యంలో ఎంపీడీవో జయశంకర్‌ ప్రసా ద్‌, పీఏసీసీఎస్‌ చైర్మన్‌ బాల్‌రెడ్డి, సర్పంచ్‌ సూర్యప్రకాశ్‌రెడ్డి, జేవీవీపీఎస్‌ జిల్లా కన్వీనర్‌ హాజమ్మ నివాళులర్పించారు. భూ త్పూర్‌ మున్సిపాలిటీ పరిధిలోని అమిస్తాపూర్‌ ఆంజనేయస్వామి దేవాలయంలో మున్సిపల్‌ చైర్మన్‌ సత్తూర్‌ బస్వరాజ్‌ బసవేశ్వర చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. దేవరకద్ర తాసిల్దార్‌ కార్యాలయంలో, ఈశ్వర వీరప్ప య్య స్వామి ఆలయంలో రెవెన్యూ ఉద్యోగులు, సంఘం నా యకులు బసవేశ్వరునికి నివాళి అర్పించారు. నవాబ్‌పేట మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో సర్పంచ్‌ గోపాల్‌గౌడ్‌, డీటీ రాజశేఖర్‌, చెన్నారెడ్డిపల్లి సర్పంచ్‌ యాదయ్య ఆధ్వర్యంలో బసవేశ్వర జయంతిని ఘనంగా నిర్వహించారు.


logo