మంగళవారం 31 మార్చి 2020
Gadwal - Mar 05, 2020 , 23:23:49

కరోనా అలర్ట్

కరోనా అలర్ట్

జోగుళాంబ గద్వాల జిల్లా ప్రతినిధి, నమస్తేతెలంగాణ : కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా ప్రజలకు క్షేత్ర స్థాయిలో అ వగాహనలు చేపడుతున్నారు.  కరోనా వ్యాధిని ఆదిలోనే అంతం చేసేందుకు ముందుస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నా రు. వైద్యారోగ్య శాఖతో పాటు మున్సిపల్‌ సిబ్బంది, ప్రభుత్వ ఉపాధ్యాయులు, గ్రా మాల్లో పంచాయతీ రాజ్‌, రెవెన్యూ ఉ ద్యోగులు ప్రజలకు క్షేత్ర స్థాయిలో అవగా హనలు కల్పిస్తున్నారు. వీటితో పాటు వ్యాధి వ్యాప్తి చెందకుండా ఆయా శాఖల పరిధిలో చేపట్టాల్సిన కార్యక్రమాలను ముమ్మరం చేస్తున్నారు.  ముఖ్యంగా ప్ర భుత్వం, ప్రైవేట్‌ దవాఖానల్లో ప్రతి ఒక్క రోగిని క్షుణ్ణంగా పరిశీలను చేసి అనుమా నం వస్తే వెంటనే చికిత్సలకు ప్రారంభించనున్నారు. 


కరోనా వ్యాధి లక్షణాలు

 కరోనా వైరస్‌లతో జలుబు వంటి చిన్న చిన్న అనారోగ్య సమస్యల నుంచి మెర్స్‌, సార్స్‌ వంటి తీవ్రమైన శ్వాసకోశ సంబంధిత వ్యాధులు వ్యాప్తి చెందుతన్నా యి.  జ్వ రం, దగ్గు, శ్వాసకోశ ఇబ్బందు లు ఈ వైర స్‌ సాధా రణంగా లక్షణాలు. కాని ఇది అవయవాలు విఫలం కావడం, న్యూమోనియాతో పాటు మరణానికి కూడా దారితీసే ప్రమాదం ఉంది. ఇప్పటి వరకు ఈ వ్యాధికి ఎటువంటి వ్యాక్సిన్‌ అందుబాటులో లేదు కాబట్టి అరికట్టాలంటే వ్యాధి సోకిన వారి నుంచి ఇతరులకు సోకకుండా జాగ్రత్త పడటమే మా ర్గం. ఈ వైరస్‌ సోకిన వారు తుమ్మి నా, దగ్గినా కూడా ఇది ఇతరులకు వ్యాపిస్తుం ది. ఈ వైరస్‌ జంతువుల వలన నుం చి వ్యాప్తి చెందుతుందని చేప్పగలం కాని ఏ జంతువు నుంచి వ్యాపిస్తుందనే కచ్చితమైన ఆధారాలు ఏమి లేవు. 


విద్యార్థులకు ప్రత్యేక పాఠాలు

కరోనా వ్యాధి వ్యాప్తి చెందకుండా ప్ర భుత్వ ఉపాధ్యాయులు విద్యార్థులకు అవగాహన తరగతులు నిర్వహిస్తున్నారు. ఈ వ్యాధి వ్యాప్తి చెందకుండా తీసుకోవల్సిన జాగ్రత్తల గురించి విద్యార్థులకు క్షుణ్ణంగా విరవరిస్తున్నారు. శుభ్రతను పాటించడం, భోజనం చేసే ముందుకు చేతులను శుభ్ర ం చేసుకొవడం. తుమ్ములు, దగ్గులు వచ్చినప్పుడు నోటికి అడ్డంగా చేతి రుమాలను పెట్టకోవడం వంటి జాగ్రత్తలను బోధిస్తున్నారు. వీటితో పాటు ఇంటిని పరిసరాలను, పాఠశాల తరగతుల్లో ఎక్క డ పడితే అక్కడ చెత్త చెదారం వేయకూడదని విద్యార్థులకు వివరిస్తున్నారు. భోజనం అనంతరం తీసుకోవల్సిన జాగ్రత్తలు గురించి చెబుతున్నారు. 


పుర వీధుల్లో ఫాగింగ్‌

మున్సిపల్‌, గ్రామ పంచాయతీ సిబ్బం ది ఎలాంటి వ్యాధులు సంక్రమించకుం డా ముందస్తు జాగ్రత్తలు చేపడుతున్నా రు. డ్రైనేజీల వెంట దుర్వాసలు రా కుండా బ్లీచింగ్‌ పౌడర్లను చల్లి మురుగునీరు నిల్వకుండా చర్యలు చేపడుతున్నా రు. పారిశుధ్య సిబ్బంది రోడ్లపై ఎక్కడా  కుళ్లిన వ్యర్థ పదార్థాలు, చనిపోయిన జంతువుల కళేబరాలు ఉండకుండా ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తున్నారు. గాలిలో కంటికి కనిపించని  వైరస్‌లు, క్రిమి కీటకాలు వ్యాప్తి చెందకుండా అన్ని వీధు ల్లో ప్రత్యేక ట్యాంకర్లను ఏర్పాటు చేసి ఫాగింగ్‌ చేస్తున్నారు. 


అవగాహనలు చేపట్టిన వైద్య సిబ్బంది

ప్రాణాంతక వ్యాధి కరోనా గురించి ఆందోళన పడనవసరం లేదని వైద్య సిబ్బంది క్షేత్ర స్థాయిలో అవగాహనలు కల్పిస్తున్నారు. కరోనా వైరస్‌ను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం తగిన జాగ్రత్తలు చేపట్టిందని భరోసాను కల్పిస్తున్నారు. వ్యాధి వ్యాప్తి చెందకుండా తీసుకోవల్సిన జాగ్రత్తలను ప్రజలకు వివరిస్తున్నారు. దగ్గు, జలుబు, తుమ్ములు వంటి వ్యాధుల తీవ్రతలు ఎక్కువగా ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచనలిస్తున్నారు. logo
>>>>>>