గురువారం 02 ఏప్రిల్ 2020
Gadwal - Mar 05, 2020 , 23:23:49

96 శాతం భూరికార్డుల ప్రక్షాళన పూర్తి

96 శాతం భూరికార్డుల ప్రక్షాళన పూర్తి

గద్వాల, నమస్తే తెలంగాణ: రెవెన్యూ శాఖ పరిధిలో ఉన్న అన్ని సమస్యలను సత్వరమే పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ శ్రుతిఓఝా తాసిల్దార్‌లను ఆదేశించారు. కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో తాసిల్దార్‌లతో రెవె న్యూ అంశాలపై ఆమె గురువారం సమీ క్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ మె అధికారులతో మాట్లాడుతూ ఆయా మండలాల్లో పెండింగ్‌లో ఉన్న భూ సమస్యలకు గల కారణాల్లో ఏమైనా అనుమానాలుంటే అదనపు కలెక్టర్‌తో చర్చించి నివృత్తి చేసుకోవాలే గాని పెండింగ్‌లో ఉంచరాదని ఆమె స్పష్టం చేశారు.క్లియర్‌ ఖాతాలను వెంటనే డిజిటల్‌ సైన్‌ చేసి పాసు పుస్తకాల ముద్రణకు పంపించాలని వారిని కలెక్టర్‌ ఆదేశించారు. సుమారు 96శాతం భూ రికార్డులు పూర్తయ్యాయని మిగిలిన వాటిని కూడా త్వరగా పరిష్కరించి జిల్లాలో ఎక్కడా భూ సమస్య లేకుండా చేయాలన్నారు. 


కొన్ని గ్రామాల్లో ఇప్పటివరకు డంపింగ్‌ యార్డు, వైకుంఠధామాలు, శ్మశానవాటికలకు స్థలం చూపించలేకపోతున్నట్లు ఎంపీడీవోల ద్వారా లిఖిత పూర్వక నివేదికలు అందినట్లు ఆమె తెలిపారు. అలాంటి గ్రామాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి స్థలాలు సేకరించి హద్దులు  చూపించాలని ఆమె వివరించారు. క ల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్‌ దరఖాస్తు ల్లో ఆయా ఎమ్మెల్యేల ఆమోదం చే యించి ఆర్డీవోకు పంపించాలని ఆమె తాసిల్దార్లను ఆదేశించారు. ఈ విషయంలో వెంటనే క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపించి దరఖాస్తులు ఆర్డీవోకు పంపించడం వల్ల దరఖాస్తుదారులకు త్వరగా లబ్ధి చేకూరుతుందని ఆమె అ న్నారు. సమీక్షలు అదనపు కలెక్టర్‌ శ్రీనివాసులురెడ్డి, ఆర్డీవో రాములు, తాసిల్దార్‌లు పాల్గొన్నారు.
logo
>>>>>>