బుధవారం 08 ఏప్రిల్ 2020
Gadwal - Mar 05, 2020 , 23:20:53

అంబేద్కర్‌ ఆశయసాధన కోసం కృషి చేద్దాం

అంబేద్కర్‌ ఆశయసాధన కోసం కృషి చేద్దాం

ధరూరు: మండల పరిధిలోని నెట్టెంపాడ్‌లో సర్పంచ్‌ పాతిమాబషీర్‌ ఆధ్వర్యంలో డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని గురువారం ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై విగ్రహావిష్కరణ చేశారు. అంతకుముందు యూత్‌ సభ్యు లు బైక్‌ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఎ మ్మెల్యే మాట్లాడుతూ అంబేద్కర్‌ జీవితం నేటి యువతకు మార్గదర్శ కం కావాలని కోరారు. విగ్రహావిష్కరణ కార్యక్రమంలో జెడ్పీటీసీ పద్మావెంకటేశ్వర్‌రెడ్డి, ఎంపీపీ నజుమున్నీసాబేగం, గట్టు ఎంపీపీ విజయ్‌, విగ్రహదాత మాజీ వైస్‌ ఎంపీపీ నాగర్‌దొడ్డి వెంకట్రామిరెడ్డి, గుడ్డెందొడ్డి సర్పంచ్‌ రఘురెడ్డి, ఎంపీటీసీ తిప్పమ్మ, ఉపసర్పంచ్‌ గోవిందు, టీఆర్‌ఎస్‌ నాయకులు శ్రీనివాస్‌రెడ్డి, సర్వారెడ్డి, జాకీర్‌, భీమ్‌రెడ్డి, కార్యకర్తలు, యూత్‌ నాయకులు పాల్గొన్నారు.


logo