బుధవారం 01 ఏప్రిల్ 2020
Gadwal - Mar 05, 2020 , 00:09:10

ప్రశాంతంగా ఇంటర్‌ పరీక్షలు

ప్రశాంతంగా ఇంటర్‌ పరీక్షలు

 


గద్వాలటౌన్‌ : ఇంటర్మీడియట్‌ పరీక్షలు బుధవారం ప్రారంభమయ్యాయి. జిల్లా మొత్తంలో 14 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. అన్ని కేంద్రాల్లో కలిపి 7998మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. మొదటి రోజు ఇంటర్‌ మొదటి సంవత్సరం విద్యార్థులు పరీక్షలు రాశారు. జిల్లా వ్యాప్తంగా 4453మంది విద్యార్థులు పరీక్ష రాయాల్సి ఉండగా 4262మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. అందులో 191మంది విద్యార్థులు గైహాజరయ్యారు. అధికారుల సూచనల మేరకు నిర్ణిత సమయానికి కంటే ముందే విద్యార్థులు పరీక్ష కేంద్రానికి చేరుకున్నారు. 


ఆలస్యమైతే అనుమతి లేదు...

ఒక నిముషం ఆలస్యమైన పరీక్షకు అనుమతినిచ్చేది లేదని ఇంటర్మీడీయట్‌ బోర్డు జిల్లా అధికారి హృదయరాజు తెలిపారు. బుధవారం జిల్లాలో నిర్వహించిన ఇంటర్‌ పరీక్షా కేంద్రాలను ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకున్నారు. పరీక్షా సమయానికి కంటే ముందు కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. అలాగే తల్లిదండ్రులు కూడా బాధ్యతగా తీసుకుని సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరేలా సహకరించాలన్నారు.

 

ప్రత్యేక ఆర్టీసీ బస్సులు ఏర్పాటు..

పరీక్షా సమయంలో విద్యార్థులకు ఇబ్బంది కలుగకుండా ఆర్టీసీ ప్రత్యేక చర్యలు తీసుకుంది. జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన కేంద్రాల వరకు బస్సులను నడిపేలా జిల్లా కలెక్టర్‌ సూచనల మేరకు ప్రత్యేక చర్యలు తీసుకుంది. 25బస్సులను విద్యార్థులకు అందుబాటులో ఉంచారు. logo
>>>>>>