బుధవారం 01 ఏప్రిల్ 2020
Gadwal - Mar 05, 2020 , 00:07:30

ప్రమాదవశాత్తు పొగాకు పంట దగ్ధం

ప్రమాదవశాత్తు పొగాకు పంట దగ్ధం

ఉండవెల్లి : ప్రమాదవశాత్తు పొగాకు పంటకు నిప్పుంటుకున్న సంఘటన బైరాపురం గ్రామంలో బుధవారం మధ్యాహ్నం చోటు చేసుకున్నది. గ్రామస్తులు తెలిపిన వివరాల మేరకు.. గ్రామానికి చెందిన సయ్యద్‌లాల్‌ తన వ్యవసాయ భూమి ఆరు ఎకరాలల్లో పొగాకు పంటను సాగు చేశాడు. పంట చేతికి రావడంతో పొగాకును 3000 దోర్నాలుగా కట్టి ఎండబెట్టాడు. మధ్యాహ్నం ప్రమాదవశాత్తు నిప్పు అంటుకున్నది. దీంతో స్థానికులు గమనించి మంటలను ట్రాక్టర్‌ ట్యాంకరుతో, ఆల్‌కాలిస్‌ కంపెనీ ఫైరింజన్‌తో ఆర్పేందుకు ప్రయత్నించారు. అప్పటికే మంటల్లో చిక్కుకున్న పొగాకు రూ.4 లక్షల విలువైనది పూర్తిగా కాలిబూడిదయ్యింది. దీంతో రైతు సయ్యద్‌లాల్‌ చేతికి వచ్చిన పంట కళ్లముందు బూడిద కావడంతో కన్నీటి పర్యంతమయ్యారు. తీవ్రంగా నష్టపోయిన రైతును ఆదుకోవాలని స్థానికులు కోరుతున్నారు. ఈ సంఘటన తెలుసుకున్న ఆర్‌ఐ మద్దిలేటి పంట నష్టంపై పంచానామా నిర్వహించారు. 


logo
>>>>>>