గురువారం 09 ఏప్రిల్ 2020
Gadwal - Mar 05, 2020 , 00:02:22

బడ్జెట్‌ అంచనాలను రూపొందించాలి

బడ్జెట్‌ అంచనాలను రూపొందించాలి

గద్వాల, నమస్తే తెలంగాణ: జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల ద్వారా 2020-21 ఆర్థిక సంవత్సరానికి సం బంధించి బడ్జెట్‌ అంచనాలను కొత్త మున్సిపల్‌ చట్టం -2019 ప్రకారం రూపొందించాల్సి ఉంటుందని జిల్లా క లెక్టర్‌ శ్రుతిఓఝా మున్సిపల్‌ కమిషనర్ల ను ఆదేశించారు. బుధవారం అదనపు కలెక్టర్‌ శ్రీనివాస్‌రెడ్డితో కలిసి మున్సిపల్‌ కమిషనర్ల ద్వారా రూపొందించిన ముసాయిదా బడ్జెట్‌ను మున్సిపాలిటీల వారిగా పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ గత ఏడాది బ డ్జెట్‌ అంచనాలకు 5శాతం అదనంగా క లిపి బడ్జెట్‌ రాబడి,ఖర్చులు తయారు చేసేవారన్నారు. ఇక నుంచి అలాంటి మూస పద్ధతి పాటించవద్దని, కొత్త ము న్సిపల్‌ చట్టం ప్రకారం నివేదిక రూపొందించాల్సి ఉంటుందన్నారు. ఆస్తి పన్ను విషయంలో ప్రతి యజమాని తన స్వంత అసెస్‌మెంట్‌ నివేదిక ప్రకారమే పన్ను వసూలు చేయడం జరిగిందని, ఏవైనా తప్పుడు లెక్కలు తేలితే వారిచ్చిన అసెస్‌మెంట్‌పై 25సార్లు అధిక లెక్కించి పెనాల్టీ విధించడం జరుగుతుందని, ముందుగానే ప్రజలకు అవగాహన కల్పించాలని ఆదేశించారు. 


ఖర్చుల విషయంలో హెడ్‌ఆఫ్‌ అకౌంట్‌ వారిగా ఖర్చులను తయారు చేయాల్సి ఉంటుందని చెప్పారు. పారిశుధ్యానికి వాడే వాహనాల నిర్వహణ, విద్యుత్‌బిల్లుల చెల్లింపులు, వీధి దీపాలకు మొదటి ప్రాధాన్యతగా నిధులు చెల్లించాల్సి ఉంటుందని ఆమె పేర్కొన్నారు. మొత్తం బడ్జెట్‌లో 10శాతం నిధులు గ్రీన్‌ప్లాన్‌కు కేటాయించాల్సి ఉంటుందన్నారు. పబ్లిక్‌ పార్కులు, టాయిలెట్లు, డంపింగ్‌యార్డు, వైకుంఠధామాల వంటి నిర్మాణాలకు, నిర్వాహణకు తదుపరి ప్రాధాన్యత క్రమంలో నిధులు కేటాయించాలన్నారు. పురపాలక సంఘంలో స్వంత నర్సరీ ఏర్పాటు చేసుకోవాలన్నారు. 10శాతం నిధులు కేవలం హరితహారంకు వాడాలని చెప్పారు. పురపాలక సంఘంలోని ప్రతి ఇంటికి జియోట్యాగింగ్‌ పూర్తి చేసి పన్ను పరిధిలోకి తీసుకరావాలన్నారు. ఈనెల 15వ తేదీ ప్రభుత్వానికి పురపాలక సంఘాల ద్వారా రూపొందించిన బడ్జెట్‌ ప్రతి పాదనలు పంపాల్సి ఉంటుందని చెప్పారు. సమావేశంలో పురపాలక కమిషనర్లు నర్సింహా, పార్థసారధి, యాదగిరి, మదన్‌మోహన్‌, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. 


logo