ఆదివారం 29 మార్చి 2020
Gadwal - Mar 04, 2020 , 01:52:38

ఒత్తిడికి గురికావొద్దు

ఒత్తిడికి గురికావొద్దు
  • ఇంటర్‌ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి చేశాం
  • హాజరుకానున్న7,998 మంది విద్యార్థులు
  • 14 కేంద్రాలు.. 228 మంది సిబ్బంది
  • 13 రూట్లలో ఆర్టీసీ ప్రత్యేక బస్సులు
  • నిమిషం ఆలస్యమైనా అనుమతించం

‘నమసే ్తతెలంగాణ’తో ఇంటర్మీడియట్‌ జిల్లా నోడల్‌ అధికారి హృదయరాజు

ఇంటర్మీడియట్‌ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. 14 కేంద్రాల్లో 7,998 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తారు. ఉదయం 9 నుంచి 12 గంటల వరకు పరీక్షలు కొనసాగుతాయి. 228 మంది సిబ్బంది పరీక్షల నిర్వహణ విధుల్లో ఉంటారు.  విద్యార్థులు సకాలంలో సెంటర్లకు చేరుకొనేందుకు 13 రూట్లలో ఆర్టీసీ బస్సులను నడుపుతున్నది. పరీక్షకు నిమిషం ఆలస్యమైనా అనుమతి ఉండదు. సెంటర్ల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా 144 సెక్షన్‌ అమల్లో ఉంటుంది’ అని ఇంటర్మీడియట్‌ జిల్లా నోడల్‌ అధికారి హృదయరాజు ‘నమస్తే తెలంగాణ’తో వెల్లడించారు.  

-జోగుళాంబ గద్వాల జిల్లా ప్రతినిధి, నమస్తేతెలంగాణ 


నేటి నుంచి ఇంటర్మీడియట్‌ పరీక్షలు ప్రా రంభమవుతున్నాయి. పరీక్షలు రాయనున్న 7,998 విద్యార్థులకు  జిల్లా ఇంటర్‌ బోర్డ్‌ అధికారులు సకల సదుపా యా లు ఏర్పాటు చేశారు. పరీక్షలకు సంబంధించిన ఏర్పాట్లను గురించి  జిల్లా ఇంటర్మీడయట్‌ నోడల్‌ అధికారి హృదయరాజుతో నమస్తే తెలంగాణ ప్రత్యేక ఇంటర్వ్యూ..

-జోగుళాంబ గద్వాల నమస్తే  తెలంగాణ


నమస్తే తెలంగాణ: ఇంటర్‌ పరీక్షలకు ఎలాంటి ఏర్పాట్లు చేశారు..? 

నోడల్‌ అధికారి : ఇంటర్‌ పరీక్షలను విజయవంతంగా నిర్వ హించేందుకు జిల్లాలో 14 మంది స్పెషల్‌ ఆఫీసర్లను, 14 మంది చీఫ్‌ సూపరింటెండెంట్లను, 86 మంది లెక్షరర్లను, 114 మంది టీచర్లను సిబ్బందిగా నియమించాం. మొత్తం జిల్లాలో 14 సెంటర్లలో అన్ని ఏర్పా ట్లు చేపట్టాం. విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యాలు తాగునీరు, అత్య వసర వైద్య సదుపాయం వంటి చర్యలు చేపట్టాం. ఇక పరీక్షల కోసం జిల్లాలో ప్రత్యేకంగా 13 రూట్లలో  బస్సులను ఏర్పాటు చేశాం. అన్ని సెంటర్లలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశాం. 


ఎంత మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు..? 

 జిల్లా వ్యాప్తంగా మొత్తం జనరల్‌, ఒకేషనల్‌ విద్యార్థులు కలిపి 7,998 మంది విద్యార్థులు  ఇంటర్మీడియట్‌ పరీక్షలకు హాజరు కానున్నారు. మొదటి సంవత్సరంలో 3,708 మంది జనరల్‌ విద్యా ర్థులు 583 ఒకేషనల్‌ విద్యార్థులు మొత్తం 4,291 విద్యార్థులు,  రెండో సంవత్సరం 3,262 మంది జనరల్‌, 445 ఒకేషనల్‌ విద్యార్థులు మొత్తం 3707 విద్యార్థులు పరీక్షలకు సన్నద్ధమవుతున్నారు. జిల్లా లోని మొత్తం 29 ఇంటర్మీడియట్‌ కళాశాలుండగా వీటిలో ప్రభుత్వ ఇంటర్మీడియట్‌ కళాశాలలు 8, ప్రైవేట్‌ ఇంటర్మీడియట్‌ కళాశాలలు 13, కేజీవీబి, గురుకులాలు కలిపి 8కళాశాలున్నాయి. 


ఈ పరీక్షలో  ఎలాంటి నిబంధనలు అమలు చేస్తున్నారు..?

ఇంటర్మీడియట్‌ బోర్డ్‌ ప్రకటించిన నిబంధలను కఠినంగా అమలు చేస్తున్నాం. పరీక్షలు ఉదయం 9గంటలకు ప్రారంభం చేయ నున్నాం. ఒక్క నిమిషం ఆలస్యమైనా విద్యార్థులను ఎట్టిపరిస్థితుల్లో పరీక్షలకు అనుమతించేది లేదు. విద్యార్థులను 8.45 గంటల నుంచి 9గంటల వరకు మాత్రమే పరీక్షాహాల్‌ లోపలికి అనుమతిస్తున్నాం. ఒక్క సిబ్బంది కూడా ఉదయం 8గంటల వరకే పరీక్షా కేంద్రాలకు చేరుకొని తమకు కేటాయించిన పరీక్షా హాళ్లను, పరీక్షా పత్రాలను సేకరించుకోవాలి. వీటితో పాటు ప్రతి సెంటర్‌లో చీఫ్‌ సూపరింటెండెంట్‌కు తప్ప మిగతా సిబ్బందికి ఎవరికి ఫొన్‌ అనుమతిని లేదు.


విద్యార్థులు ఒత్తిడికి గురికాకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు..?

విద్యార్థులు ఒత్తిడికి గురవుతున్న అంశాలపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధను చూపిస్తుంది. పరీక్షల్లో మార్కులు తగ్గినా, ఫెయిల్‌ అయిన విద్యార్థుల తీవ్ర మానసిక ఒత్తికి గురైన సందర్భాలు చాలా ఉన్నాయి. విద్యార్థులను ఈ పరిస్థితుల నుంచి బయటపడేసేందుకు వారిని మాసికంగా దృఢంగా చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా ప్రతి కళాశాలకు ఒక కౌన్సిలర్లను ఏర్పాటు చేసింది. జిల్లాలో 21మంది కౌన్సిలర్లకు విద్యార్థులను మానసిక ఒత్తిడి నుంచి బయటపడేయటం ఎలా అనే అంశాలపై ప్రత్యేకంగా శిక్షణలు అందించాం. విద్యార్థులం దరూ ఎలాంటి ఒత్తిడి లేకుండా పీస్‌ఫుల్‌ మైండ్‌తో పరీక్షలు రాయండి.


మాస్‌ కాపీయింగ్‌ పాల్పడిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారు..? జిల్లాలో సమస్యాత్మక సెంటర్లను గుర్తించారా..?

 మాస్‌ కాపీయింగ్‌ పాల్పడిన విద్యార్థులకు చట్టపరమైన శిక్షలు అమలు చేస్తాం. ఎవరైనా మాస్‌ కాపీయింగ్‌ పాల్పడితే గరిష్టంగా రెండేళ్ల పాటు పరీక్షలకు అనుమతించడం జరుగదు, కనిష్ఠంగా ఆయా సెమిస్టర్‌ పరీక్షలన్నింటిని రద్దు చేయడం జరుగుతుంది. కాపీయిండ్‌ పాల్పడుతూ పట్టుబడిన విద్యార్థి ప్రశ్నా పత్రానికి నకల్‌ చీటిని జోడించి ఇంటర్మీ డియట్‌ బోర్డ్‌కు పంపిస్తాం. అక్కడి ఉన్నతాధికారులు చర్యలపై నిర్ణయం తీసుకుంటారు. పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులను అనుమతించే ముందు బాలుర, బాలికలకు ప్రత్యేకంగా తనిఖీలు నిర్వహించి ఎలాంటి అను మానస్పద వస్తులు, సెల్‌ఫొన్స్‌, క్యాలిక్యూలేటర్లను అనుమతించకుండా చర్యలు చేపడుతున్నాం. ఒన్‌ ఎక్జామినేషన్‌ ఉన్న సెంటర్లు మల్దకల్‌, గట్టు, ధరూర్‌, మానవపాడు, అలంపూర్‌ కేంద్రాలను ఒక బృందం ఫ్లైయింగ్‌ స్కాడ్స్‌ను నియమించాం. ఇద్దరు సభ్యులతో కూడిన ఈ బృందం ఆయా పరీక్షా కేంద్రాల్లో తనిఖీలు చేయనున్నారు. ఇక జిల్లాలో సమస్యాత్మాక పరీక్షా కేంద్రాలను ఏమి కూడా లేవు.


logo