బుధవారం 08 ఏప్రిల్ 2020
Gadwal - Feb 29, 2020 , 23:59:57

కార్తీక్‌ హత్య కేసులో ముగ్గురు నిందితుల అరెస్ట్‌

కార్తీక్‌ హత్య కేసులో ముగ్గురు నిందితుల అరెస్ట్‌

గద్వాల, నమస్తే తెలంగాణ: జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రం బుర్ధపేటకు చెందిన కార్తీక్‌ ఈనెల 24న మిగ్సింగ్‌ కాగా శుక్రవారం మేలచెరువు శివారులో హత్యకు గురై శవం బయట పడిన సంఘటన విధితమే. అందుకు సం బంధించి ముగ్గురు వ్యక్తులను గద్వాల పోలీసులు శనివా రం అరెస్ట్‌ చేశారు. అందుకు సంబంధించిన వివరాలను డీఎస్పీ శ్రీనివాస్‌రెడ్డి శనివారం పట్టణ పోలీస్‌స్టేషన్‌లో విలేకర్లకు వివరించారు. డీఎస్పీ తెలిపిన వివరాలు ప్రకారం.. మహబూబ్‌నగర్‌కు చెందిన రాగసుధకు కార్తీక్‌ డిగ్రీలో క్లాస్‌మేట్‌. గత ఏడాదిన్నర కిందట రాగసుధతో కార్తీక్‌కు ఫేస్‌ బుక్‌ ద్వారా పరిచయమై వారి ఇద్దరు సన్నిహితంగా ఉన్న ట్లు డీఎస్పీ తెలిపారు. నెల రోజులుగా కార్తీక్‌, రాగసుధ మధ్య మనస్పర్థలు రావడంతో రాగసుధ ఇక నా దగ్గరకు రావద్దని హెచ్చరించినట్లు చెప్పారు. అయినప్పటికీ కార్తీక్‌ ఆమెను వేధిస్తుండడంతో అతనిని అడ్డు తొలగించుకోవాలని భావించి డిగ్రీలో రాగసుధకు సీనియర్‌ అయిన ము న్నూర్‌ రవికుమార్‌ అలియాస్‌ దొంగరవికి ఈ విషయం తెలిపినట్లు చెప్పారు. ఫిబ్రవరి 24న కార్తీక్‌ ఇంటిలో వాళ్ల అమ్మతో రూ.1000 తీసుకుని మహబూబ్‌నగర్‌కు వ్యా పార పని నిమిత్తం వెళ్తున్నాని చెప్పి వెళ్లినట్లు డీఎస్పీ వెల్లడించారు. మహబూబ్‌నగర్‌కు వెళ్లిన కార్తీక్‌ రాగసుధను వేధించడంతో ఆమె రవికి ఫోన్‌ చేసి మహబూబ్‌నగర్‌కు రప్పించినట్లు చెప్పారు. అక్క డ ఫొన్‌లో రవి, కార్తీక్‌ ఇద్దరు వాదనలు చేసుకున్నట్లు చెప్పారు. 


చివరికి కార్తీక్‌ తాను మహబూబ్‌నగర్‌లో 9 బార్‌లో మద్యం తాగుతున్నానని చెప్పడంతో తన మిత్రులతో రవి అక్కడికి వెళ్లి కారులో కార్తీక్‌ను తీసుకుని గద్వాల పట్టణ సమీపంలో ఉన్న నదిఅగ్రహారం దగ్గరలో ఉన్న శ్మశానం కాడికి రాత్రి 1గంట ప్రాం తంలో తీసుకొచ్చారని, తన మిత్రుల తో కార్తీక్‌ను తీవ్రంగా కొట్టారని చెప్పారు. అనంతరం ఆర్టీసీ పెట్రోల్‌ బంక్‌ వద్ద ఉన్న రవి దుకాణం దగ్గర రాత్రంతా కారు అక్కడే నిలిపారన్నారు. ఉదయం లేచి చూడగా కార్తీక్‌ మరణించడంతో అతనిని అదే కారులో 99 ప్యాకేజి కాలువ సమీపంలో పూడ్చినట్లు చెప్పారు. కుటుంబ సభ్యుల అనుమానాల మేరకు రవిని అదుపులోకి తీసుకుని విచారించగా, హత్యచేసినట్లు అంగీకరించినట్లు తెలిపాడన్నారు. రాగసుధను వేధిస్తున్నందుకే హత్య చేసినట్లు నేరం అంగీకరించినట్లు డీఎస్పీ వెల్లడించారు. కార్తీక్‌ హత్యకు రవితో పాటు మరో ఎనిమిది మంది సహకరించినట్లు తెలిపారు. ప్రస్తుతం ఏ-1గా రవితో పాటు అతని దుకాణంలో పనిచేసే వసంత్‌, సునీల్‌ను అరెస్ట్‌ చేసినట్లు చెప్పారు. మిగతా నిందితులైనా డ్రైవర్‌ వీరేశ్‌, సునీల్‌, రంజిత్‌, రాజేశ్‌, భీం, ఉదయ్‌లు పరారీలో ఉన్నట్లు డీఎస్పీ వెల్లడించారు. వారిని త్వరలో అరెస్ట్‌ చేస్తామని చెప్పారు. వారితో పాటు కుటుంబ సభ్యు లు అజయ్‌ అనే వ్యక్తిపై అనుమానం వ్యక్తం చేశారని, ఆ దిశగా విచారణ చేస్తామని చెప్పారు. విలేకరుల సమావేశంలో శాంతినగర్‌ సీఐ వెంటకటేశ్వర్లు, పట్టణ ఎస్‌ఐ సత్యనారాయణ ఉన్నారు.


కార్తీక్‌  మృతదేహానికి పోస్టుమార్టం

గద్వాల తాసిల్దార్‌ మంజుల సమక్షంలో ఉదయం మేల్వచెరువు శివారులో గట్టి పోలీస్‌ బందోబస్త్‌ మధ్య కార్తీక్‌ను హత్య చేసి పూడ్చిన ప్రదేశంలోనే డాక్టర్లు శవానికి పోస్ట్‌మార్టం నిర్వహించారు.అనంతరం శవాన్ని అతని కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ నిందితులను అరెస్ట్‌ చేసి బాధితులకు న్యాయం జరిగే విధంగా కృషి చేస్తామని తెలిపారు.పోస్టుమార్టం దగ్గర సీఐ హనుమంతు,ఎస్‌ సత్యనారాయణతో పాటు ఇతర పోలీసులు ఉన్నారు.


logo