గురువారం 02 ఏప్రిల్ 2020
Gadwal - Feb 29, 2020 , 23:58:31

జీవన విధానంలో పచ్చదనం, పరిశుభ్రత భాగమవ్వాలి

జీవన విధానంలో పచ్చదనం, పరిశుభ్రత భాగమవ్వాలి

గద్వాల, నమస్తే తెలంగాణ: పచ్చదనం, పరిశుభ్రత ప్రతి ఒక్కరి జీవనవిధానంలో ఒక భాగం కావాలని ఆ దిశగా అధికారులు ప్రజలను చైతన్యపర్చాలని కలెక్టర్‌ శ్రుతిఓఝా పిలుపునిచ్చారు. శనివారం ఉద యం పురపాలక కార్యాలయ ఆవరణలో కొత్త గా వచ్చిన చెత్త సేకరణ వాహనాలను ఆమె ఎ మ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, పురపాలక చై ర్మన్‌ బీఎస్‌ కేశవ్‌తో కలి సి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భం గా కలెక్టర్‌ మాట్లాడుతూ పట్టణ ప్రగతిలో భాగం గా పురపాలక సంఘం లో ప్రతి ఇంటి నుంచి తడి, పొడిచెత్తను సేకరించేందు కు 7 ఆటోలు కొనుగోలు చేసేందుకు ఉత్తర్వులు జారీ చేశారు. 


అందులో భాగంగా మొదటి విడతలో ఐదు ఆటోలు వచ్చినట్లు తెలిపారు. పరిశుభ్రత విషయంలో ప్రజలు వివేకంతో వ్యవహరించాలని ఆమె సూచించా రు. తమకు సరఫరా చేసిన బుట్టల్లో తడి, పొడిచెత్తను వేసి ఇంటి వద్దకు వచ్చిన పురపాలక వాహనంలో వేయాలని సూచించారు. పట్టణ ప్రగతిలో భాగంగా పారిశుధ్యంపై ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులకు ఆదేశించారు. ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి మాట్లాడుతూ గద్వాల పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో ప్రజలు భాగస్వాములు కావాలని, అందరూ కలిస్తేనే గద్వాలను సుందరంగా తీర్చుకో గలుగుతామని అన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులతోపాటు ప్రతి పౌరుడు పరిశుభ్రత, పచ్చదనంలో భాగస్వాములు కావాల్సిందిగా కోరారు. కార్యక్రమంలో అసిస్టెంట్‌ కలెక్టర్‌ శ్రీహర్ష, వైస్‌ చైర్మన్‌ బాబర్‌, పురపాలక కమిషనర్‌ నర్సింహ తదితరులు ఉన్నారు.


logo
>>>>>>