శనివారం 28 మార్చి 2020
Gadwal - Feb 28, 2020 , 23:20:26

పట్టణాల్లో ‘ప్రగతి’ ఉద్యమం

పట్టణాల్లో ‘ప్రగతి’ ఉద్యమం

గద్వాల, నమస్తే తెలంగాణ:  జిల్లాలోని అన్ని పం చాయతీల్లో పల్లెప్రగతి కార్యక్రమం నిరంతరాయంగా కొనసాగాలని, లేని పక్షంలో సంబంధిత అధికారులపై చర్యలు తప్పవని కలెక్టర్‌ శ్రుతిఓఝా అధికారులను ఆ దేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరం లో జెడ్పీసీఈవో, డీఆర్‌డీవో, డీపీవో, పంచాయతీ రా జ్‌ ఇంజినీర్లతో పల్లెప్రగతిపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఏ గ్రామ పంచాయతీకి వెళ్లినా చెత్త, చెదారం కుప్పలు కనిపిస్తున్నాయని, జాతీయ రహదారి పొడవున సైతం  పారిశుధ్యం లోపించిందని కార్యదర్శులు ఉండి ఏమి చేస్తున్నట్లని ప్రశ్నించారు. పంచాయతీ కార్యదర్శి పోస్ట్‌ ఎందుకు ఉండాల ని ఆగ్రహం వ్యక్తం చేశారు. పారిశుధ్య నిర్వహణ సరిగా లేకపోతే పంచాయతీ కార్యదర్శికి షోకాజ్‌ నోటిసులు జారి చేయాలని డీపీవోను ఆదేశించారు. అన్ని డంపింగ్‌యార్డులకు స్థల సేకరణను ఆదివారం సాయంత్రం లోపు పూర్తి చేయాలని డీపీవోను చెప్పారు. జిల్లాలో వ చ్చే బుధవారం లోపు అన్ని పంచాయతీలకు ట్రాక్టర్లు అందాలన్నారు. 


నర్సరీల వి షయంలో డీఆర్‌డీవోనుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు రోజుల్లో అన్ని నర్సరీలకు సంబంధించి పను లు పూర్తి చేయాలని ఆదేశించారు. హరితహారం మొక్క లు 85శాతం కన్నా తక్కువ గా ఉండటానికి వీలు లేదన్నారు. అలాంటి పంచాయతీల ఫీల్డ్‌ అసిస్టెంట్‌లు, టెక్నికల్‌ అసిస్టెంట్లను ఉపేక్షించేది లేదని జెడ్పీ సీఈవో ముషాయిదాబేగంను ఆదేశించారు. జిల్లాలోని 255 ప్రంచాయతీలకు గాను పంచాయతీ రాజ్‌, ఇంజినీరింగ్‌ విభాగానికి 199 పంచాయతీల్లో వైకుంఠధామాలు ఏర్పాటుకు పరిపాలన అ నుమతులు ఇవ్వడం జరిగిందన్నారు. 144 పంచాయతీలలో స్థల సేకరణ పూరైందని చెప్పారు. మిగతా 55 పంచాయతీల్లో స్థల సేకరణను ఆదివారం లోపు గుర్తిం చి వాటిలో నిర్మాణాలకు మార్క్‌అవుట్‌ ఇవ్వాలని పం చాయతీరాజ్‌ ఇంజినీర్లను సూచించారు. సమావేశం లో అధికారులు నర్సింహులు, డీపీవో కృష్ణ, శ్యాంసుందర్‌, రవీందర్‌ తదితరులు పాల్గొన్నారు.


logo