శుక్రవారం 03 ఏప్రిల్ 2020
Gadwal - Feb 28, 2020 , 23:15:50

శాంతిభద్రతల పరిరక్షణకే కార్డన్‌ సెర్చ్‌

 శాంతిభద్రతల పరిరక్షణకే కార్డన్‌ సెర్చ్‌

అయిజ : శాంతిభద్రతల పరిరక్షణ కోసమే కార్డన్‌ సెర్చ్‌ నిర్వహించినట్లు ఏఎస్పీ కృష్ణ పేర్కొన్నారు. శుక్రవారం ఉదయం 5 గంటల నుంచి 8గంటల వరకు  అయిజ మున్సిపాలిటీ పరిధిలోని దుర్గానగర్‌లో శాంతినగర్‌ సీఐ కార్డన్‌ సెర్చ్‌లో భాగంగా ఇంటింటికీ వెళ్లి తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికీ వెళ్లి వాహనాల తనిఖీలతోపాటు వాహనాల ధ్రువీకరణ పత్రాలను పరిశీలించా రు. సరైన పత్రాలు లేని 32 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా కా లనీ వాసులతో ఏఎస్పీ కృష్ణ మాట్లాడుతూ వాహనాలను కొనుగోలు చేసే సమయంలోనే రిజిస్ట్రేషన్‌తోపాటు, ఇన్సూరెన్స్‌, డ్రైవింగ్‌ లైసెన్స్‌ను విధిగా పొందాలన్నారు. 


వాహనాలు నడిపే సమయంలో హెల్మెట్‌ను విధిగా వినియోగించాలన్నారు. ఇండ్లు అద్దెకు ఇచ్చే సమయంలో అన్ని రకాల ఆధారాలు సేక రించిన తర్వాతనే ఇతరులకు ఇవ్వాలన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రజల భద్రతకు పెద్దపీట వేస్తుందన్నారు. మహిళల భద్రతకు ప్రత్యేకంగా షీటీంలను ఏర్పాటు చేసిందన్నారు. ఏఆపద వచ్చిన పోలీసులు ఉన్నారని గ్రహించాల న్నారు. అపరిచిత వ్యక్తుల కదలికలపై పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. జిల్లాలోని అన్ని పట్టణాలు, గ్రామాలలో కార్డన్‌ సెర్చ్‌ నిర్వహించి ప్రజలను చైతన్యం చేస్తామ న్నారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ శ్రీనివా సరెడ్డి, శాంతినగర్‌ సీఐ వెంకటేశ్వర్లు, ఎస్సైలు జగదీశ్వర్‌, నాగశేఖర్‌రెడ్డి, మంజునాథరెడ్డి, అరుణ్‌, ఇద్దరు ఏఎస్సైలు, 40 మంది పోలీస్‌ ఇబ్బంది పాల్గొన్నారు. 


పిల్లల సంరక్షణపై అవగాహన కల్పించాలి

గద్వాలటౌన్‌ : ఇంటిదగ్గర పిల్లల సంరక్షణపై తల్లులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పాటించాల్సిన పద్దతులపై ఆశాలు ఎప్పటికప్పుడు అవగాహన కల్పించాలని ఇన్‌చార్జి డీఎంహెచ్‌వో డాక్టర్‌ సునిత సూచించారు. జిల్లా కేంద్రంలోని డీఎంహెచ్‌వో కార్యాలయంలో అయిదు రోజులుగా ఆశాలకు ఇస్తున్న శిక్షణ కార్యక్రమం శుక్రవారం ముగిసింది. ముఖ్యఅతిథిగా హాజరైన ఆమె టీబీ నివారణకై కృషి చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం సర్టిఫికేట్స్‌ను అందచేశారు. కార్యక్రమంలో రాష్ట్ర మానిటరింగ్‌ అధికారి రవికిరణ్‌, డీపీహెచ్‌ఎన్‌ బ్యులా, డీపీఎంవో మల్లికార్జున్‌, సూపర్‌వైజర్‌ రమేశ్‌, హెచ్‌ఈ మదుసూధన్‌రెడ్డి, శిక్షణ సిబ్బంది వరలక్ష్మి, జ్యోతి, పార్వతమ్మ పాల్గొన్నారు. 


logo