సోమవారం 06 ఏప్రిల్ 2020
Gadwal - Feb 25, 2020 , 00:22:59

ప్రజలను భాగస్వామ్యం చేయాలి

ప్రజలను భాగస్వామ్యం చేయాలి

జోగుళాంబ గద్వాల జిల్లా ప్రతినిధి, నమస్తేతెలంగాణ : పల్లె ప్రగతి కార్యక్రమంలో ప్రజలను భాగస్వామ్యం చేసే విధంగా కార్యక్రమా లు నిర్వహిస్తే అద్భుతమైన ఫలితాలను సాధించవచ్చని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌ రెడ్డి అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలో సీఎన్‌జీ ఫంక్షన్‌హాల్‌లో కలెక్టర్‌ శ్రుతి ఓఝా అధ్యక్షతన నిర్వహించిన పల్లెప్రగతి పంచాయతీరాజ్‌ సమ్మేళనానికి ఎంపీ రాములు, జెడ్పీ చైర్మన్‌ సరిత, ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్‌ రెడ్డి, డాక్టర్‌ వీఎం అబ్రహంలో కలిసి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి నిరంజ న్‌ రెడ్డి మాట్లాడుతూ స్వాతంత్య్ర పోరాటం, తెలంగాణ పోరాటాలు ప్రజలు భాగస్వామ్యం చేయడం వలనే విజయాలను సాధించగలిగామని ఆయన గుర్తు చేశారు. ఇదే స్పూర్తితో అధికారులు, ప్రజాప్రతినిధులు పల్లెప్రగ తి కార్యక్రమంలో ప్రజలను భాగస్వామ్యం చేసిన పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని పిలుపునిచ్చారు. దేశ ప్రగతి కోసం ప్రతి ఒక్క పౌరుడూ తన వంతు కృషిచేయాల్సిన అవసరం ఉందన్నారు. గతంలో ఎలాంటి టెక్నాలజీ అందుబాటలో లేని కాలంలోనే కాకతీయ రాజులు ఎన్నో కోటలను, లక్షా 20వేల చెరువులను నిర్మాణాలు చేపట్టిన చరిత్రలున్నాయని చెప్పారు. ఆకాలంలోనే సాధ్యమైన పనులు ఈ ఆధునిక కాలంలో సాధ్యం కావడం ఎంతో తేలికని చెప్పుకొచ్చారు. ఉన్నతమైన లక్ష్యాలను నిర్ణయించుకొని గ్రామాల ప్రగతి కోసం కార్యదర్శులు, సర్పంచులు కృషి చేయాలన్నారు. ప్రభుత్వం పంచాయతీ రాజ్‌ శాఖ ద్వారా ప్రతి గ్రామీణపౌరునికి ఏడాదికి రూ.1655 అందిస్తుందని వీటిని సద్వినియోగ పరుచుకొని అభివృద్ధి చేయాలన్నారు. ఇక గ్రామాల్లో ప్రభుత్వ పనులకు అడ్డంకిగా మారిన ఇసుక కొరతను వెంటనే పరిష్కరించాలని ఆయన కలెక్టర్‌కు ఆదేశాలు జారీ చేశారు. వీటితో పాటు రహదారుల సరిహద్దులు గుర్తించి హరితహారం కార్యక్రమాన్ని చేపట్టాలని ఆదేశించారు. గ్రామం పంచాయతీ నిధులను అవసరాన్ని బట్టి మళ్లీంచి నిర్మాణాలకు విని యోగించుకునేలా సదుపాయం ఆచరణ చేపట్టాలన్నారు. 


సీఎం కేసీఆర్‌ కలలు నెరవేర్చాలి: ఎంపీ రాములు

దేశంలో ఇప్పటి వర కు ఏ సీఎం చేపట్టని పల్లె ప్ర గతి, పట్టణ ప్రగ తి కార్యక్రమాల ను సీఎం కేసీఆర్‌ చేపట్టారని నాగర్‌కర్నూల్‌ ఎంపీ రాము లు అన్నారు. పల్లెప్రగతి కార్యక్రమాలు ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకొని నెరవేర్చితే భవిష్యత్తు తరాలను ఎంతో మేలు చేసిన వారవుతారన్నారు. హరితహారం కార్యక్రమం చేపట్టడం ద్వారా భవిష్యత్‌ తరాల ప్రజలకు స్వచ్ఛమైన వాతావరణాన్ని అందించవచ్చన్నారు. ప్రభుత్వం నుంచి కావల్సినన్ని నిధులు సమకూర్చుతాయని సమస్యలను పరిష్కరిస్తూ మందుకు సాగాలని పిలుపునిచ్చారు. 


సమస్యలను అధిగమించాలి: జెడ్పీ చైర్‌పర్సన్‌ సరిత

పల్లె ప్రగతి కార్యక్ర మాల్లో ఎదురవు తన్న సమ స్యల ను ఒక్కొక్కటి గా అధిగమిస్తూ విజయాన్ని సాధించాలని జెడ్పీ చైర్‌పర్సన్‌ సరిత పిలుపుని చ్చారు. ప్రజాప్రతినిధులు, అధికారులు తమ పద వులను న్యాయం చేయాలన్నారు. ఎంతో నమ్మకంతో ఓటు వేసి గెలిపించిన ప్రజలకు సేవ లు చేసి నమ్మకాన్ని నిలబెట్టు కోవాలని చెప్పారు. సర్పం చులకు ఎదురవుతన్న నిధుల మంజూరు సమస్య లను పరిష్కరించాలని మంత్రిని కోరారు. అన్ని సదుపాయాలు సమకూర్చితే సర్పంచులు ఎన్నో విజయాలని సాధిస్తారన్నారు. 


నిర్లక్ష్యం వహిస్తే చర్యలు: కలెక్టర్‌ శ్రుతి ఓఝా

ప్రభుత్వం పల్లె ప్రగ తి కార్యక్రమం ద్వా రా చేపట్టిన ప ను లన్నీ చాలా మౌ లికమైన కార్యక్ర మాలని కలెక్టర్‌ శ్రుతి ఓఝూ అ న్నారు.  జిల్లాలో కొన్ని గ్రామాల్లో పల్లెప్ర గతి కార్యక్రమాలు విజయవంతంగా చేసినప్పటికీ చాలా వరకు గ్రామాల్లో ఆశించిన ఫలితాలను సాధించలేకపోయారని చెప్పారు. ఎంపీడీవోలకు, పంచాయతీ కార్యదర్శులకు ఇతర జిల్లాలో మా దిరిగా అదనపు భాధ్యతలు ఏమి లేవని గుర్తు చేశారు. అయినప్పటికీ వారి విధులను నిర్వర్తించ డంలో నిర్లక్ష్యం చూపుతున్నారన్నారు. సర్పంచు లు, ప్రజాప్రతినిధులు తమ తమ గ్రామాలకు మంచి పనులు చేస్తే ఎప్పటికీ మరిచిపోలేని గుర్తింపుని సొంతం చేసుకుంటారని సూ చించా రు. ప్రతి గ్రామంలో పల్లెప్రగతి కార్యక్ర మం పనులను పరిశీలిస్తానని అలసత్వం వహిం చిన వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని తెలిపా రు. 


గ్రామాల రూపురేఖలు మారాయి : ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి

ప్రభుత్వం చేపట్టిన పల్లెప్రగతి ద్వారా జిల్లాలో గ్రామాల రూపు రేఖలు మారి పో యాన ని ఎమ్మెల్యే బం డ్ల కృష్ణ మోహన్‌ రెడ్డి అన్నారు.   ప్ర తి ఒక్కరిని లెక్కగట్టి ప్రతి నెల 5వ తేదీలోపు నిధులను సమకూర్చుతున్నారని చెప్పారు. కాని నిధులను ఖర్చుచేసే విషయంలో చాలా వరకు సాంకేతిక సమస్యలు ఏర్పడుతున్నాయని వివ రించారు. ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ నిధులను వినియో గించుకోవడంలో చాలా వరకు ఇబ్బందులు ఎదురవుతు న్నాయని చెప్పారు. ఈ కారణం చేత గ్రామాలను అభివృద్ధి చేయాలని ప్రయత్నించి నప్పటికి కొన్ని విషయాల్లో వైఫల్యం చెందుతు న్నారన్నారు. జిల్లా ఉన్నతాధికారులు నిధుల మళ్లీంపు విషయాలను కేవలం కాగితాల్లో మాత్ర మే చూపిస్తున్నారు తప్పా ఆచరణలో చూపడం లేదన్నారు. వీటితో పాటు విద్యుత్‌ సమస్యలు కూ డా గ్రామాల్లో ఎక్కువగా నమోదవుతు న్నాయని వాటి వలన ప్రజలు ప్రాణాలు పోతున్నప్పటికి విద్యుత్‌ అధికారులు పట్టించుకోవడం లేదని మంత్రి నిరంజన్‌రెడ్డికి ఫిర్యాదు చేశారు. ప్రభు త్వం చేపట్టిన ఈచ్‌ వన్‌ టీచ్‌వన్‌ కార్యక్రమంలో సర్పంచ్‌లను అవకాశం కల్పిస్తే కార్యక్రమం ఎంతో విజయ వంతం అవుతుందన్నారు. 


ఆరోగ్యకర వాతావరణం అందించాలి : ఎమ్మెల్యే అబ్రహం

ప్రభుత్వం ఎంతో ముందు చూపు తో పల్లెప్రగతి చేపట్టిందని ఎమ్మెల్యే డాక్ట ర్‌ వీఎం అబ్ర హం అన్నారు. హరి తహారం కార్యక్రమం ద్వారా మొక్కలు నాటడం ద్వారా భవిష్యత్‌ తరాలను ఆ రోగ్యవంతమైన వాతావరణాన్ని అందించవచ్చని చెప్పారు. పల్లె ప్రగతి కార్యక్ర మానికి ప్రభుత్వం అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తుంద న్నారు. వీటన్నింటిని సద్వినియోగం చేసుకొని సర్పం చులు, కార్యదర్శులు గ్రామాలను అభివృద్ధి చేసు కోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో కన్జ్యూ మర్‌ ఫెడరేషన్‌ చైర్మన్‌ గట్టు తిమ్మప్ప, ఆర్డీవో రా ములు, డీపీవో కృష్ణ, ఎంపీడీవోలు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, పంచాయతీ కార్యద ర్శులు, సర్పం చులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. 
logo