సోమవారం 06 ఏప్రిల్ 2020
Gadwal - Feb 25, 2020 , 00:21:38

అత్యాధునిక మార్కెట్‌, టాయిలెట్స్‌

అత్యాధునిక మార్కెట్‌, టాయిలెట్స్‌

మహబూబ్‌నగర్‌ మెట్టుగడ్డ: కూరగాయల కోసం అత్యాధునిక వసతులతో మార్కెట్‌ను నిర్మించుకోవడం ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుందని రాష్ట్ర పురపాలక, ఐటీశాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామరావు అన్నారు. సోమవారం మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలో మంత్రి కేటీఆర్‌ పర్యటనలో భాగంగా అత్యాధునికమైన ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్‌ను, టాయిలెట్స్‌ నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేశారు. పట్టణంలోని 13 ప్రాంతాల్లో స్థలాలను గుర్తించి ప్రజలకోసం నిర్మిస్తున్నట్లు తెలిపారు. మంత్రి కేటీఆర్‌ ముఖ్య అతిథిగా హాజరై, మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌, ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డితో కలసి శంకుస్థాపనలు చేశారు. అంతకుముందు జెడ్పీ చైర్‌ పర్సన్‌ స్వర్ణసుధాకర్‌రెడ్డి, కలెక్టర్‌ వెంకట్రావు, జిల్లా ఇన్‌చార్జి ఎస్పీ అపూర్వరావు, మున్సిపల్‌ కమిషనర్‌ కేసీ నర్సిములు మంత్రి కేటీఆర్‌కు పూలమొక్కలు అందజేసి ఘనంగా స్వాగ తం పలికారు. అనంతరం ఒక ఎకరా స్థలంలో ఇంటిగ్రేడెడ్‌ అత్యాధునిక వెజ్‌, నాన్‌వెజ్‌ కూరగాయ ల మా ర్కెట్‌ను శంకుస్థాపన చేసి ప్రారంభించారు. ఆరునెల లో నిర్మాణం పూర్తిచేస్తామని మంత్రి తెలిపారు. అభిమానులు మంత్రి కేటీఆర్‌తో కలిసి సెల్ఫీ దిగేందు కు పోటీపడ్డారు.   మంత్రిని కలిసేందుకు పెద్ద సంఖ్యలో యువత ప్రయత్నం చేయగా మంత్రి అం దరిని కలిశారు. త ర్వాత ప్రభుత్వ జనరల్‌ దవాఖాన ఆవరణలో మూ త్రశాలల ఏర్పాటుకు శంకుస్థాపన చేశారు. నిత్యం వైద్యసేవల కో సం వచ్చే ప్రజలకు మూత్రశాలల ఏర్పాటు ఎంతో అవసరమన్నారు. కార్యక్రమంలో కౌన్సిలర్‌ గంజి వెంకట్రాములు, షబ్బీర్‌, దవాఖాన మెంబర్లు లక్ష్మిలు పాల్గొన్నారు.


అడుగడుగునా పోలీసు బందోబస్తు 

మంత్రి కేటీఆర్‌ జిల్లా పర్యటనలో భాగంగా అడుగడుగునా పోలీసు బందోబస్తు నిర్వహించారు.  జిల్లా ఇన్‌చార్జి ఎస్పీ అపూర్వరావు, ఏఎస్పీ వెంకటేశ్వర్లు పర్యవేక్షణలో ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా కట్టుదిట్టమైన భద్రత, ని ఘా ఏర్పాటు చేశారు. ప్రత్యేక పోలీసుల కాన్వాయ్‌తో మంత్రి పర్యటన కొనసాగింది. ప్రశాంతంగా నిర్వహించేందుకు తగు జాగ్రత్తలు తీసుకున్నారు. డైట్‌ కళాశాల ఆవరణలో ప్రారంభిస్తున్న మార్కెట్‌ ఏర్పాటును అడ్డుకునేందుకు ధర్నా చేస్తున్న విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రత్యేక వాహనంలో తరలించా రు. ఎటువంటి అల్ల ర్ల జరగకుండా పోలీసులు భద్రత నిర్వహించారు. 


logo