సోమవారం 30 మార్చి 2020
Gadwal - Feb 23, 2020 , 23:25:34

నేడు పాలమూరుకు కేటీఆర్‌

నేడు పాలమూరుకు కేటీఆర్‌
 • ఉదయం 10:30 గంటలకు పర్యటన షురూ
 • పట్టణ ప్రగతికి శ్రీకారం చుట్టనున్న మంత్రి
 • ఏర్పాట్లు పూర్తి చేసిన అధికార యంత్రాంగం
 • కలెక్టర్‌తో కలిసి పర్యవేక్షించిన మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌

 నేడు పాలమూరు జిల్లా కేంద్రానికి మున్సిపల్‌  మంత్రి కేటీఆర్‌ రానున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభంకానున్న పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని ఆయన ప్రారం భించనున్నారు. ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్నం వరకు ఆయన పర్యటన కొనసాగనున్నది. ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. కలెక్టర్‌ వెంకట్రావుతో కలిసి మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ పనులను పర్యవేక్షించారు. 

- మహబూబ్‌నగర్‌ ప్రధాన ప్రతినిధి/నమస్తే తెలంగాణ


మహబూబ్‌నగర్‌ ప్రధాన ప్రతినిధి, నమస్తే తెలంగాణ : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ‘పట్టణ ప్రగతి’ కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా పట్టణ కేంద్రాల్లో శ్రీకా రం చుడుతుంది. పట్టణ ప్రాంతాల్లో నెలకొన్న సమస్యలకు శాశ్వతంగా పరిష్కరించేందుకుగానూ పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని ప్రభుత్వం అంకుర్పారణ చేసింది. మహబూబ్‌నగర్‌ పురపాలికలోని పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని ప్రా రంభించేందుకు రాష్ట్ర ఐటీ, మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ సోమవారం జిల్లా కేంద్రానికి రానున్నారు. ఈ మేరకు అధికార యంత్రాగం ఇప్పటికే ఏర్పాట్లను పక్కా ప్రణాళికలతో పూర్తి చేసింది. పట్టణ కేంద్రంలోని మంత్రి కేటీఆర్‌ ఆరంభించనున్న, శంకుస్థాపన చేయనున్న పనులను మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌, జిల్లా కలెక్టర్‌ ఎస్‌ వెంకట్రావు ప్రత్యేకంగా పరిశీలించారు. ఏర్పాట్లలో ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు తెలియజేశారు. అదేవిధంగా ఈ నెల 25న కల్వకుర్తి  పట్టణ ప్రగతిలో మంత్రి కేటీఆర్‌ పాల్గొనున్నట్లు కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌, మున్సిపల్‌ చైర్మన్‌ ఎడ్మ సత్యం తెలిపారు. 


మంత్రి కేటీఆర్‌ పర్యటన ఇలా..

 • ఉదయం 9 గంటలకు సీఎం కేసీఆర్‌ క్యాంపు కార్యాలయం నుంచి రోడ్డు మార్గం మీదుగా మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రానికి బయలుదేరుతారు. 
 • ఉదయం 10:30 గంటలకు మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రానికి చేరుకోనున్నారు. జిల్లా కేంద్రంలోని మెట్టుగడ్డ వద్ద ఉన్న డైట్‌ కళాశాల మైదానం నందు వెజ్‌-నాన్‌వెజ్‌ మార్కెట్‌ నిర్మించేందుకుగాను శంకుప్థాపన చేస్తారు. 
 • ఉదయం 10:45 గంటలకు న్యూటౌన్‌ నుంచి రైల్వేస్టేషన్‌ రోడ్డుకు ఇరువైపులా ఏర్పాటు చేసిన స్ట్రీట్‌ లైట్లను ప్రారంభిస్తారు. 
 • 11 గంటలకు ప్రభుత్వ జూనియర్‌ కళాశాల మైదానంలో కేటీఆర్‌ క్రీడా ప్రాంగణాన్ని ప్రారంభిస్తారు. 
 • 11:15 గంటలకు పాతతోట ప్రాంతాన్ని కాలినకడను ప్రత్యేకంగా పరిశీలిస్తారు. 
 • 11:45 గంటలకు మున్సిపల్‌  కార్యాలయం నందు స్వచ్ఛఆటోలను ప్రారంభిస్తారు. 
 • మధ్యాహ్నం 12 గంటలకు జిల్లా కేంద్రంలోని అప్పన్నపల్లి వద్ద ఉన్న వైట్‌హౌస్‌ నందు మున్సిపల్‌ కౌన్సిలర్లు, వార్డు కమిటీ మెంబర్లు, అధికారులతో సమావేశం కావడం జరుగుతుంది. 


logo