బుధవారం 08 ఏప్రిల్ 2020
Gadwal - Feb 23, 2020 , 23:10:31

సమస్యల పరిష్కారానికే ‘పట్టణ ప్రగతి’

సమస్యల పరిష్కారానికే ‘పట్టణ ప్రగతి’

జోగుళాంబ గద్వాలజిల్లా ప్రతినిధి, నమస్తేతెలంగాణ : రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు సోమవారం నుంచి జిల్లాలో పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఇందుకు సంబంధించి జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లను సిద్ధం చేసింది. జిల్లాలోని గద్వాల, అయిజ, అలంపూర్‌, వడ్డేపల్లి మున్సిపాలిటీలో కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. సోమవారం నుంచి మార్చి 4వ తేదీ వరకు 10రోజుల పాటు పట్టణాలలోని అన్ని వార్డుల్లో ‘పట్టణ ప్రగతి’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన మున్సిపల్‌ చట్టాన్ని అమలు చేయనున్నారు. జిల్లాలోని అధికారులు, ప్రజాప్రతినిధులు క్షేత్రస్థాయిలో పర్యటించనున్నారు. మురికి వాడల్లోని పారిశుధ్య సమస్యలను పూర్తిగా తొలగించనున్నారు. పల్లెప్రగతి కార్యక్రమాన్ని చేపట్టి గ్రామాల్లో ప్రభుత్వం అనూ హ్య మార్పులు తీసుకొచ్చింది. ఒకప్పుడు పట్టణాలను చూసి పల్లెలు నేర్చుకోవాలని చెప్పేవారు.. నేడు పల్లెలను చూసి పట్టణాలు నేర్చుకోవాలని చెప్పే పరిస్థితులు ఏర్పడ్డాయి. సీఎం కేసీఆర్‌ గ్రామాల అభివృద్ధి కోసం కావల్సినన్ని నిధులు కేటాయించి ప్రతి గ్రామం అవసరాలను తీర్చుతున్నారు. ప్రతి గ్రామ పంచాయతీకి ప్రతి నెల 5వ తేదీ వరకు టంచన్‌గా గ్రామ పంచాయతీకి నిధులు సమకూర్చుతున్నారు. ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమాల్లో పల్లెల్లో ఘణనీయమైన మార్పులొచ్చాయి. ప్రతి గ్రామం అభివృద్ధి పథంలో దూసుకుపోతోంది. ఇదే స్థాయిలో పట్టణాల రూపురేఖలను కూడా మార్చేందుకు ప్రభుత్వం పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని చేపట్టింది.


నేటి నుంచి పట్టణ ప్రగతి ప్రారంభం

జిల్లాలోని గద్వాల, అలంపూర్‌, వడ్డేపల్లి, అయిజ మున్సిపాలిటీల్లో నేటి నుంచి పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. 10 రోజుల్లో మున్సిపల్‌ అధికారులు ఒక్కో రోజు ఒక్కో కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. పారిశుధ్యానికి సంబంధించి పనులను షెడ్యూల్‌గా త యారు చేసుకొని వాటి ప్రకారం కార్యక్రమాలు నిర్వహించనున్నారు. కార్యక్రమంలో జోన్లు, కమిటీల వారీగా నియమించిన అధికారులు, వార్డు కౌన్సిలర్లు పాల్గొని ప్ర తి వార్డులో పారిశుధ్య పనులను చేపట్టనున్నారు.  


జిల్లాలో 308 కమిటీల ఏర్పాటు

పట్టణ ప్రగతి కార్యక్రమం విజయవంతగా నిర్వహించేందుకు ప్రభుత్వం ప్రతి వార్డులో కమిటీలను ఏర్పాటు చేస్తోంది. ఒక్కో వార్డులో 4 కమిటీలను ఏర్పాటు చేసి ఈ కమిటీల్లో ఒక్కో కమిటీలో 60 మందిని సభ్యులుగా చేయనున్నారు. 60 మందిలో యువత, మహిళలు, సీనియర్‌ సిటిజన్లు, ప్రభుత్వ ఉద్యోగులు, ప్రముఖులను సభ్యులుగా నియమించనున్నారు. జిల్లాలోని గద్వాల, అయిజ, అలంపూర్‌, వడ్డేపల్లి మున్సిపాలిటీల్లో  గద్వాలలో 37 వార్డులు, అయిజలో 20 వార్డులు, అలంపూర్‌లో 10 వార్డులు, వడ్డేపల్లిలో 10 వార్డులు మొత్తం 77 వార్డులున్నాయి. ప్రతి వార్డుకు 4 కమిటీల చొప్పున మొత్తం 308 కమిటీలను అధికారులు ఏర్పాటు చేయనున్నారు. ఈ కమిటీల్లో మొత్తం 18,480 మంది సభ్యు లు ఉండనున్నారు. ఒక్కో కమిటీకి ప్రత్యేక అధికారులను నియమించి వీటన్నింటిని కలెక్టర్‌, మున్సిపల్‌ కమిషనర్‌, చైర్మన్లు పర్యవేక్షించనున్నారు. నియోజవర్గాల పరిధిలో ఎమ్మెల్యేలు ప్రత్యేక చొరవ తీసుకొని పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని విజయవంతం చేయనున్నారు.  


చేపట్టనున్న పారిశుధ్య కార్యక్రమాలు

పట్టణ ప్రగతి కార్యక్రమంలో ప్రధానంగా పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టిని పెట్టనున్నారు. ప్రతి ప ట్టణాన్ని పరిశీలించి  ప్రధాన సమస్యలను గుర్తించనున్నారు. అనంతరం ప్రణాళికలను సిద్ధం చే సుకొని ఒక్కో సమస్యను పరిష్కరిస్తూ కార్యక్రమాలను చేపట్టనున్నారు. 10 రోజు ల్లో   ప్రధాన రహదారుల వెంట ఉన్న చెత్తాచెదారాన్ని తొలగించడం, రోడ్లకు ఇరువైపులా ఎలాంటి అపరిశుభ్ర వాతావరణం కనిపించకుండా శుభ్రం చేయడం, డ్రైనీజీలను నాలాలను శుభ్రపరిచి కాలువల్లో మురుగునీరు నిల్వకుండా శాశ్వత పరిష్కారం చేపట్టనున్నారు.  వర్షం నీరు ఎక్కడా నిలిచిపోకుండా తగిన చర్యలు తీసుకోవ డం, ప్రధాన రహదారులు మరమ్మతులు చేపట్టడం,  రో డ్లపై ఎక్కడా కూడా గుంతలు లేకుండా నగర వాసులకు ఇబ్బందులు కలుగకుండా చేయడం, రోడ్లను సుందరంగా తీర్చిదిద్ది ఇరువైపులా మొక్కలు నాటడం,  వీటితో పాటు ట్రాఫిక్‌ నియంత్రణ చేసేందుకు రద్దీగా ఉండే ప్రాంతాల్లో తగిన చర్యలు తీసుకోవడం,  వ్యాపారులకు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తారు. 


వీధి దీపాల మరమ్మతులు చేపట్టి ప్రతి కాలనీలోని రోడ్లలో విద్యుత్‌ కాంతులు వెదజిమ్మెలా తగిన జాగ్రత్తలు తీసుకోవడం, నగర వీధుల్లో, రహదారుల్లో పాస్టిక్‌ చెత్తను పూర్తిగా తొలగించే పనులు చేపడతారు.  ఎక్కడా పాస్టిక్‌ కనిపించకుండా ప్రజలు, స్వచ్ఛంద సంస్థల సహకారం తీసుకొని పూర్తిగా తొలగించి డీఆర్‌సీ సెంటర్‌కు తరలిస్తారు. ప్రధాన కూడళ్లలోని వాల్‌ పోస్టర్లను తొలగించి రహదారుల వెంట హరితహారం కార్యక్రమం చేపట్టడం, డివైడర్లకు రంగులు వే యించి అందంగా తీర్చిదిద్దం వంటి కార్యక్రమాలను చేపట్టనున్నారు. వాటన్నింటిని ఒక్కో రోజు ఒక్కో కార్యక్రమంగా విడతల వారీగా నిర్దిష్టమైన రోజులను కేటాయిం చి నిర్వహిస్తారు. ఈ కార్యక్రంలో పట్టణ ప్రజలకు స్వచ్ఛతపై అవగాహనలు తీసుకొచ్చి స్వచ్ఛందంగా పారిశుధ్య పనుల్లో పాల్గొనేలా చేయనున్నారు. 


logo