శుక్రవారం 03 ఏప్రిల్ 2020
Gadwal - Feb 23, 2020 , 23:08:20

శాంతి భద్రతల పరిరక్షణకే కార్డన్‌ సెర్చ్‌

శాంతి భద్రతల పరిరక్షణకే కార్డన్‌ సెర్చ్‌

గద్వాల అర్బన్‌ : శాంతి భద్రతల పరిరక్షణకే కార్డ న్‌ సెర్చ్‌ నిర్వహించడం జరుగుతుందని అడిషినల్‌ ఎస్పీ కృష్ణ పేర్కొన్నారు. అదివారం తెల్లవారుజామున జిల్లా కేం ద్రంలోని పీజేపీ క్యాంప్‌ వెనుక భాగంలో గల హమాలి కాలనీలో డీఎ స్పీ శ్రీనివాస్‌రెడ్డి ఆధ్వర్యంలో కార్డన్‌ సెర్చ్‌ ని ర్వహించారు. ఈ సందర్భంగా కాలనీలోని ప్రతి ఇంటికి పోలీస్‌లు వెళ్లి కుటుంబ సభ్యులు వివరాలు అడిగి తెలుసుకున్నారు. అద్దెకు ఉన్న స్థానికేతరుల గుర్తింపు కార్డులను పరిశీలించారు. వాహనాలకు సంబంధించిన పత్రాలను పరిశీలించారు. ఈ తనిఖీలో 270 నివాసాల్లో సోదాలు ని ర్వహించి సరైన ధ్రువపత్రాలు లేని 29 ద్విచక్ర వాహనలతోపాటు ఒక ఆటో ట్రాలీ వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఏఎస్పీ కృష్ణ మాట్లాడుతూ ప్రజల్లో శాంతి భద్రతల విషయంలో ధైర్యం క ల్పించడంతోపాటు నేరస్తులను పట్టుకునేందుకు, అనుమానుతులను గుర్తించేందుకు ఈ కార్డన్‌ సెర్చ్‌ నిర్వహించడం జరుగుతుందన్నారు. 


కొత్త వ్యక్తుల పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాతే వారికి ఇల్లు అద్దెకు ఇ వ్వాలన్నారు. అనుమానితులు కాలనీలో కనిపిస్తే వెం టనే పోలీస్‌లకు సమాచారం అందించాలన్నారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్‌ నియమాలపై అవగాహన కలిగి ఉం డాలని, మైనర్‌లకు వాహనాలిస్తే వారి తల్లిదండ్రులపై కేసులు నమోదు చేయడం జరుగుతుందని ఏఎస్పీ హెచ్చరించారు. అదేవిధంగా కాలనీలో అందరూ ఐక్యమంతంగా ఉంటూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకునేందుకు ముందుకు రావాలని ఆయన సూచించారు. నేరాల నియంత్రణలో సీసీ కెమెరాలు ఎంతగానో ఉపయెగపడుతాయని ఒక్క సీసీ కెమెరా వంద మంది పోలీస్‌లకు సమానమని అన్నారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ శ్రీనివాస్‌రెడ్డి, సీఐ జక్కుల హనుమంతు, ఎస్సై సత్యనారాయణతోపాటు పలువురు ఎస్సైలు, 45 మంది పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు.


logo