శనివారం 04 ఏప్రిల్ 2020
Gadwal - Feb 22, 2020 , 05:06:26

హర..హర.. మహాదేవ

హర..హర.. మహాదేవ

నమస్తే తెలంగాణ, నెట్‌వర్క్‌:మహాశివరాత్రి సందర్భంగా శుక్రవారం ఉమ్మడి జిల్లాలోని శైవక్షేత్రాలకు ఆధ్యాత్మిక శోభ సంతరించుకున్నది. భక్తుల శివనామస్మరణతో ఆలయాలు కిక్కిరిసిపోయాయి.  ఉదయం నుంచి శివాలయాల్లో అభిషేకాలు, అర్చనలు చేశారు. ఉపవాస దీక్షలు ఉన్న భక్తులు సాయంత్రం శివాలయాలకు వెళ్లి పూజలు చేశారు. శ్రీశైలం, ఉమామహేశ్వరం, సోమశిల, అలంపూర్‌ బాలబ్రహ్మేశ్వరస్వామి క్షేత్రాలతోపాటు జిల్లా కేంద్రాల్లోని శివాలయాలకు భక్తులు పోటెత్తారు. భౌరాపూర్‌ జాతరకు చెంచులు భారీ సంఖ్యలో తరలొచ్చారు.


logo