గురువారం 02 ఏప్రిల్ 2020
Gadwal - Feb 21, 2020 , 01:56:04

పార్ట్‌-బీలోని ఖాతాలపై.. ప్రత్యేక దృష్టి పెట్టాలి

పార్ట్‌-బీలోని ఖాతాలపై.. ప్రత్యేక దృష్టి పెట్టాలి

సమగ్ర భూసర్వేలోని పెండింగ్‌లో ఉన్న పార్ట్‌-ఏ, బీ ఖాతాలపై తాసిల్దార్‌లు ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్‌ శ్రుతిఓఝా అధికారులను ఆదేశించారు. గురువారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా అన్ని మండలాల తాసిల్దార్లతో పెండింగ్‌ ఖాతాల పురోభివృద్ధిపై సమీక్ష నిర్వహించారు.

  • పాసుపుస్తకాపార్ట్‌-బీలోని ఖాతాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి
  • తాసిల్దార్లతో వీసీలో కలెక్టర్‌ శ్రుతిఓఝా
  • పాసుపుస్తకాలను వెంటనే పంపిణీచేయాలి
  • గ్రామాల్లోని ప్రభుత్వ భూమి వివరాలు వెంటనే నివేదిక ఇవ్వండి
  • వారం రోజుల్లో పనుల్లో పురోగతి కనిపించాలి
  • తాసిల్దార్లతో వీసీలో కలెక్టర్‌ శ్రుతిఓఝా లను వెంటనే పంపిణీచేయాలి
  • గ్రామాల్లోని ప్రభుత్వ భూముల వివరాలు వెంటనే నివేదిక ఇవ్వండి
  • వారం రోజుల్లో పనుల్లో పురోగతి కనిపించాలి

గద్వాల, నమస్తే తెలంగాణ: సమగ్ర భూసర్వేలోని పెండింగ్‌లో ఉన్న పార్ట్‌-ఏ, బీ ఖాతాలపై తాసిల్దార్‌లు ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్‌ శ్రుతిఓఝా అధికారులను ఆదేశించారు. గురువారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా అన్ని మండలాల తాసిల్దార్లతో పెండింగ్‌ ఖాతాల పురోభివృద్ధిపై సమీక్ష నిర్వహించారు. గతవారం చూపించిన పెండింగ్‌ నివేదికలోని అంశాల వారీగా క్లియర్‌ ఖాతాల క్లియరెన్స్‌, బ్యాక్‌లాగ్‌ సక్సేసన్‌, మ్యూటేషన్‌, మీసేవ సక్సేషన్‌, మ్యూటేషన్‌ పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీపై సమీక్ష నిర్వహించారు. జిల్లాలో కొంతమంది తాసిల్దార్‌లు పెండింగ్‌ పనులను ఎందుకు పూర్తిచేయలేదని ఆమె వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. క్లియర్‌ ఖాతాలకు యుద్ధ ప్రాతిపాదికన డిజిటల్‌ సైన్‌ చేయాలని ఆమె తెలిపారు. గద్వాల తాసిల్దార్‌ వద్ద పంపిణీ కాని పుస్తకాలు అధికంగా ఉన్నట్లు గుర్తించామని వీఆర్‌వోల ద్వారా వెంటనే రైతులకు వాటిని అప్పగించే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ తాసిల్దార్లకు ఆదేశించారు.


ఆయా మండలాల్లో పనికిరాని ప్రభుత్వ భూమిని గుర్తించి విస్తీర్ణం వివరాలు సోమవారం లోగా నివేదిక అందజేయాలని ఆదేశించారు. ప్రజావాణి ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని, ప్రతివారం ప్రజావాణి పెండింగ్‌ నివేదిక చూడటం జరుగుతుందని ఆమె స్పష్టం చేశారు. శ్మశానవాటికకు స్థలం లేని గ్రామాల్లో మండల అభివృద్ధి అధికారులు పర్యటించి ప్రభుత్వ భూమిని జీపీకి అప్పగించాలన్నారు. ప్రస్తుతం ఆయా నివేదికల్లో కనిపిస్తున్న పెండింగ్‌ పనులు వచ్చే వారానికి పూర్తిచేసి పనుల్లో పురోగతి కనిపించేందుకు కృషిచేయాలని తాసిల్దార్‌లను కలెక్టర్‌ ఆదేశించారు. ఈ వీసీలో ఆర్డీవో రాములు, ఏవో భద్రప్ప, సూపరింటెండెంట్‌లు రాజు, సుందర్‌రాజ్‌, శ్రీనివాసాచారి తదితరులు పాల్గొన్నారు.


logo