మంగళవారం 31 మార్చి 2020
Gadwal - Feb 20, 2020 , 00:09:08

ఉపాధికి కూలీలకు

ఉపాధికి  కూలీలకు


గద్వాల, నమస్తే తెలంగాణ: ప్రతి ఏటా వేసవిలో ఉపాధి కూలీలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చల్లని కబురులు ఇస్తుంది. ఈ ఏడాది కూడా ఉపాధి కూలీలకు వేసవి అదనపు భత్యం ప్రకటించడంతో కూలీలకు కొంత ఊరట లభించింది. రాష్ట్రంలో ప్రసు త్త వేసవిలో ఉపాధి హామీ పథకం కింద వి విధ రకాల పనులను చేసే కూలీలకు అదన పు వేతనం అందనుంది. మిగతా కాలం తో పోలిస్తే వేసవిలో భూమి గట్టిగా ఉండ డం వల్ల కూలీలు ఎక్కువగా కష్టపడాల్సి వస్తుం ది. ఈ కారణం చేత వేసవిలో అదన పు భ త్యం గ్రామీణా భివృద్ధి శాఖ అందజేయడానికి చర్యలు తీసుకుంది. ఫిబ్రవరి 1వ తేదీ నుంచి మొదలై జూన్‌ 30 వరకు ఈ వేసవి భత్యాన్ని కూలీలకు అందించనున్నారు. దీంతో జిల్లాలో 1,58,765 జాబ్‌కార్డులు ఉండగా 3,59,694మంది కూలీలకు లబ్ధి చేకూరనుంది. ఇందులో స్త్రీలు 1,88,696 ఉండగా పురుషులు 1,70, 998 మంది ఉన్నారు.


జిల్లాలో 3,59,694మంది కూలీలు

జోగుళాంబ గద్వాల జిల్లాలో 12 మండలాల్లో 1,58,756మందికి జాబ్‌ కార్డులు ఉండగా  3,59,694మంది కూలీలు ఉన్నా రు. వీరికి ప్రస్తుతం రోజుకు కూలీ రూ.150 నుంచి 200వరకు లభిస్తుంది. కరువు, వే సవి కాలంలో ఎక్కడ కూలీ పని దొరకని స మయంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తో కూలీలను ఈ పథకం ఆదుకోనుంది. ఈ పథకం పారదర్శకంగా అమలు చేయడానికి అధికారులు కృషి చేస్తున్నారు.


వేసవిలో అదనపు భత్యం ఇలా..

వేసవిలో ఉపాధిహామీ కూలీలకు ఈ విధంగా అదనపు భత్యం అందించడానికి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఫిబ్రవరి నుంచి జూన్‌ వరకు ప్రత్యేక పనిదినాలుగా గుర్తించి కూలీలకు ఈ భత్యం వర్తింప జేయనుంది. ఎండ తీవ్రతతో ఎక్కడ పను లు లభించని కారణంగా ప్రభుత్వం అదనపు భత్యం చెల్లించాలని నిర్ణయించింది. ప్రసు త్తం ఇస్తున్న వేతనానికి అదనంగా రూ. 20మొదలు అదనంగా రూ.30 చెల్లించడానికి నిర్ణయం తీసుకుంది. ఫిబ్రవరి నెలలో కూలీలకు రూ.20శాతం, మార్చిలో 25 శాతం, ఏఫ్రిల్‌లో 30శాతం, మే నెలలో 30శాతం, జూన్‌ మాసంలో 20శాతం వరకు అందనుంది. ఫిబ్రవ రిలో ఇప్పటికే పనులు ముగిసినప్పటికి అప్పటి పనులకు కూడా అదనపు వేతనం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం చెల్లిస్తున్న కూలీకి అదనంగా పెరిగిన వేతనం కలుపు కుంటే కూలీలకు రూ.250 వరకు అందే అవకాశం ఉంది. ప్రభుత్వం ఉపాధి కూలీలకు వేసవి భత్యం ప్రక టించడంతో కూలీలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.logo
>>>>>>