గురువారం 02 ఏప్రిల్ 2020
Gadwal - Feb 20, 2020 , 00:05:21

రైతు సంక్షేమమే సర్కారు ధ్యేయం

 రైతు సంక్షేమమే  సర్కారు ధ్యేయం


అయిజ: రైతు సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పథకాలను అమలు చే స్తుందని ఎమ్మెల్యే అబ్రహం అన్నారు. బుధవారం పట్టణంలోని తిక్కవీరేశ్వరస్వామివారి ఉత్సవాల్లో భాగంగా ఆలయ ప్రాంగణంలో అంతర్‌ రాష్ట్రస్థాయి సీనియర్‌ విభాగం బండలాగుడు పోటీలను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రతి ఏటా జాతర ఉత్సవాల్లో భాగంగా పల్లెల సంస్కృతి, సం ప్రదాయాలకు అనుగుణంగా  రైతు సంబురాలను నిర్వహించుకోవడం అనాధిగా వస్తున్న సంప్రదాయమన్నారు. పశుబల ప్రదర్శనకోసం రైతులు ఎద్దులను సర్వాంగ సుందరంగా ముస్తాబు చేయడంతోపాటు వాటి సంరక్షణకోసం రూ. లక్షలు వెచ్చించడం చూస్తుంటే పశువులపై  వారికున్న అభిమానం తెలుస్తుందన్నారు. స్వామివారి ఉత్సవాల్లో భాగంగా పశుబల ప్రదర్శన పోటీలు నిర్వహించడం గర్వకారణమన్నారు. ఉత్సవాలను జిల్లాలో కనీవినీ ఎరుగని రీతిలో నిర్వహించడంతో దేవస్థాన కమిటీని ఎమ్మెల్యే అభినందించారు. అంతకుముందు ఎద్దుల యజమానులను ఎమ్మెల్యే శాలువాతో సన్మానించారు. 


తిక్కవీరేశ్వరస్వామి దర్శనం ..

తిక్కవీరేశ్వరస్వామిని ఎమ్మెల్యే అబ్రహం దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఎమ్మెల్యే అబ్రహాన్ని ఆల య కమిటీ సభ్యులు శాలువాతో సత్కరించారు. 

మున్సిపాలిటీలో ట్రాక్టర్ల ప్రారంభం మున్సిపాలిటీలో చెత్తను డంపింగ్‌ యార్డుకు తరలించేందుకు 13వ ఆర్థిక సంఘం నిధులు రూ. 23 లక్షలతో కొనుగోలు చేసినరెండు ట్రాక్టర్లను ఎమ్మెల్యే అబ్రహం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడు తూ..  ట్రాక్టర్ల నిర్వహణను నిరంతరం ప్యవేక్షణ జరుపాలని కమిషనర్‌ యాదగిరిని ఆదేశించారు. 


 బండలాగుడు పోటీలలో విజేతలు

 జోగుళాంబ గద్వాల జిల్లా, అయిజ మండలం, తుపత్రాలకు చెందిన చంద్రశేఖర్‌ ఎద్దులు 3,072 అడుగుల దూరం బండనులాగి మొదటి స్థానంలో నిలువగా, కర్నూల్‌ జిల్లా, ప్యాపిలి మండలం,  పీఆర్‌పల్లికి చెందిన శివకోటి ఎద్దులు 2,842 అడుగుల దూరం లాగి రెండో స్థానంలో నిలిచాయి. అనంతపురం జిల్లా, ఉరవకొండకు చెందిన నిష్టర్‌ ఎద్దులు 2,792 అడుగుల దూరం లాగి మూడో స్థానంలో నిలువగా, కర్నూల్‌ జిల్లా, డోన్‌ మండ లం, అనంతపురం జిల్లా, వెంకన్నపల్లికి చెందిన లక్ష్మిరంగారెడ్డి ఎద్దులు 2,758 అడుగుల దూరం లాగి నాలుగో స్థానంలో నిలిచాయి. కర్నూల్‌ జిల్లా, పత్తికొండకు చెం దిన భాస్కర్‌ నాయక్‌ ఎద్దులు 2,5 91అడుగుల దూరం బండనులాగి ఐదోస్థానంలో నిలిచినట్లు ఆలయ కమిటీ పే ర్కొంది. ఆయా కార్యక్రమాల్లో మున్సిపల్‌ చైర్మన్‌ చిన్న దేవన్న, వైస్‌ చైర్మన్‌ మాల నర్సింహులు, ఆలయ కమిటీ సభ్యులు మల్లికార్జున్‌రెడ్డి, పెద్దబుజ్జి, దర్జి శివ, రవి, అశో క్‌, రామకృష్ణ, టీఆర్‌ఎస్‌ నాయకులు విష్ణువర్ధన్‌రెడ్డి, రవిరెడ్డి, రైతులు, భక్తులు పాల్గొన్నారు. 


logo