మంగళవారం 31 మార్చి 2020
Gadwal - Feb 19, 2020 , 23:41:40

‘పది’ పరీక్షలకు ముందస్తు చర్యలు తీసుకోండి

‘పది’ పరీక్షలకు  ముందస్తు చర్యలు తీసుకోండి


గద్వాల, నమస్తేతెలంగాణ: మార్చి 19 నుంచి ఏప్రిల్‌ 6 వరకు నిర్వహించనున్న పదోతరగతి పరీక్షలను సజావుగా నిర్వహించేందుకు పకడ్బందీగా ముందస్తు చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ శ్రుతిఓఝా విద్యాశాఖ అధికారులతో పాటు లైన్‌ డిపార్ట్‌మెంట్‌ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టర్‌ తన చాంబర్‌లో పదోతరగతి పరీక్షల నిర్వాహణ సన్నద్ధతమై సమీక్ష నిర్వహించా రు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడు తూ..పరీక్షలు  విద్యార్థుల భవితవ్యంతో  కూడుకున్నదని ఎలాంటి తప్పులకు తా వులేకుండాలైన్‌ డిపార్ట్‌మెంట్‌ అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో మొత్తం 38పరీక్షా కేం ద్రాలు ఉన్నాయని ఇందులో 36 సెంట ర్లు రెగ్కూలర్‌ కాగా రెండు సప్లమెంటరీ విద్యార్థులకు కేటాయించినట్లు తెలిపా రు. ఈ ఏడాది జిల్లాలో 8035 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్న ట్లు తెలిపారు. 38 సెంటర్లకుగాను 11 సెంటర్లకు అందుబాటులో పో లీస్‌స్టేషన్‌, పోస్టాఫీస్‌ సౌకర్యం లేనివిగా గుర్తించడం జరిగిందని కాబట్టి అలాంటి సెం టర్‌కు ప్రతిరోజూ ప్రశ్నాపత్రం తీసుకెళ్లి జవాబు పత్రాలు తిరిగి పోస్టాపీస్‌కు అందజేసే వరకు పూర్తి బందోబస్త్‌ ఉం డాలన్నారు. జిల్లా విద్యాశాఖ అధికారి ద్వారాప్రశ్నాపత్రాలు తెప్పించుకోవడం, వాటిని పరీక్షా కేంద్రాలకు అందుబా టు లో ఉన్న పోలీస్‌స్టేషన్‌లలో భద్రపర్చ డం వంటి చర్యలు పకడ్బందీగా తీసు కోవాలన్నారు. ఫ్లయింగ్‌స్కాడ్‌, సిట్టిం గ్‌స్కాడ్‌లను నియమించడంతో పాటు ఇన్విజిలేటర్లను ఎంపికచేసి వారికి శిక్షణ తరగతులు ఏర్పాటు చేయాలని ఆదేశిం చారు. పోస్టల్‌ డిపార్ట్‌మెంట్‌ వారు పరీక్ష పూర్తయిన వెంటనే అదేరోజు మహ బూబ్‌నగర్‌కు పోస్ట్‌ చేసే విధంగా చర్య లు తీసుకోవాలన్నారు. 


డిపో మేనేజర్‌ ద్వారా అన్ని పరీక్షాకేంద్రాలకు బస్సులు సమయానికి విద్యార్థులను చేరవేసే వి ధంగా బస్సులు నడపాలని ఆదేశించా రు. విద్యుత్‌శాఖ వారు పరీక్షా కేంద్రాల్లో ఉదయం 8గంటల నుంచి మధ్యాహ్నం 1గంటవరకు నిరంతరాయంగా వి ద్యు త్‌ సరఫరా జరిగే విధంగా  చూడాలన్నా రు. పురపాలక శాఖ ద్వారా అన్ని పరీక్షా కేంద్రాల్లో పారిశుధ్య పనులు చేపట్టాలని సూచించారు. పరీక్షల నిర్వాహణకు ప్ర శ్నాపత్రాలు తీసుకురావడం, పరీక్షా కేం ద్రాలకు చేరవేయడం తిరిగి తీసుకు  రా వడానికి సరిపడినంతగా వాహనాలు అందుబాటులో ఉంచాల్సిన బాధ్యత జిల్లా రవాణశాఖ అధికారులదే అన్నా రు. అన్ని పరీక్షా కేంద్రాల్లో ప్రథమ చికిత్సకు సరిపడా మందులు, సిబ్బందితో పాటుగా మోబైల్‌ మెడికల్‌ వాహనాన్ని అందుబాటులో  ఉంచాలని వైద్య ఆరోగ్యశాఖ అధికారిని ఆదేశించారు. పరీక్ష లు సజావుగా నిర్వహించడానికి ఏమై నా సమస్యలు తలెత్తితే క్షణాల్లో పరిష్కరించడానికి కంట్రోల్‌ రూం ఏర్పాటు చేయడం జరుగుతుందని ఇది పరీక్షలు పూర్తయ్యే వరకు 24గంటలు పని చే స్తుందని తెలిపారు. సమస్యను తెలపడానికి కంట్రోల్‌ రూం నంబర్‌ 801984 7785కు ఫోన్‌ చేయాలని సూచించారు.  కార్యక్రమంలో ఆర్డీవో రాములు, జిల్లా ఇన్‌చార్జి విద్యాధికారి సుశీంద్రరావు, ఏఎస్పీ కృష్ణ, జిల్లా రవాణశాఖ అధికారి పురుషోత్తంరెడ్డి, పరీక్షల నిర్వాహకుడు శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.logo
>>>>>>