గురువారం 09 ఏప్రిల్ 2020
Gadwal - Feb 18, 2020 , 23:48:43

మరోమారు పట్టణ ప్రగతి

మరోమారు పట్టణ ప్రగతి

బల్దియాల అభివృద్ధే లక్ష్యంగా మరోమారు పట్టణ ప్రగతిని ప్రారంభించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నది. ఈ నెల 24వ తేదీ నుంచి ఈ కార్యక్రమాన్ని జిల్లాలోని నాలుగు పట్టణాల్లో చేపట్టనున్నది. ఇందుకు సంబంధించిన సీఎం కేసీఆర్‌ అధికా రులకు ప్రజాప్రతినిధులకు దిశానిర్దేశం చేశారు.

  • ఈ నెల 24నుంచి ప్రారంభం
  • కలెక్టర్లు, ఎమ్మెల్యేలు, మున్సిపల్‌ చైర్మన్లకు దిశానిర్దేశం చేసిన సీఎం కేసీఆర్‌
  • ఏర్పాట్లు ముమ్మరం చేస్తున్న ప్రజాప్రతినిధులు, అధికారులు
  • జోన్లుగా మున్సిపాలిటీల విభజన
  • ప్రత్యేక అధికారుల కేటాయింపు

బల్దియాల అభివృద్ధే లక్ష్యంగా మరోమారు పట్టణ ప్రగతిని ప్రారంభించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నది. ఈ నెల 24వ తేదీ నుంచి ఈ కార్యక్రమాన్ని జిల్లాలోని నాలుగు పట్టణాల్లో చేపట్టనున్నది. ఇందుకు సంబంధించిన సీఎం కేసీఆర్‌ అధికా రులకు ప్రజాప్రతినిధులకు దిశానిర్దేశం చేశారు. జిల్లాలోని గద్వాల, అలంపూర్‌, వడ్డేపల్లి, అయిజలో పట్టణ ప్రగతికి కావాల్సిన సిబ్బంది, యంత్రాలపై ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ప్రతి మున్సిపా లిటీని జోన్లుగా విభజించి ప్రతి జోన్‌కు ప్రత్యేక అధికారిని నియమించనున్నారు.   

-జోగుళాంబ గద్వాల జిల్లా ప్రతినిధి,నమస్తే తెలంగాణ


జోగుళాంబ గద్వాల జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ : పల్లెప్రగతి కార్యక్రమా న్ని చేపట్టి గ్రామాల్లో తీసుకువచ్చిన మార్పులను, ప్రజల్లో కల్పించని అవగాహనలను పట్టణాల్లో కూడా తీసుకురావాలని ప్రభు త్వం నిర్ణయించింది. ఇందుకు కోసం అన్ని మున్సిపాలిటీల పరిధిలో పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని చేపడుతున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించి సీఎం కేసీఆర్‌ ప్రగతి భవన్‌లో మంగళవారం ప్రజా ప్రతినిధులకు, అధికారులకు కార్యక్రమానికి సంబంధించి విధివిధాలను సూచించారు. ప్రతి పట్టణం సర్వంగా సుంద రంగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. దీంతో జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు కారక్రమాన్ని చేపట్టేందుకు కావల్సిన ప్రణాళికలను సిద్ధం చేసే పనిలో పడ్డారు. 


జోన్లుగా మున్సిపాలిటీల విభజన

పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహిం చేందుకు అధికారులు పక్కా ప్రణాళికలతో ముందుకు వెళ్తున్నారు. జిల్లాలోని గద్వాల, అయిజ, అలంపూర్‌, వడ్డేపల్లి మున్సిపాలిటీల్లో పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. ప్రతి ఒక్క వార్డును కూడా శుభ్రం చేసేందుకు మున్సిపాలిటీలను జోన్లుగా విభజించనున్నారు. గద్వాల లో 37వార్డులు, అయిజలో 20 వార్డులు, అలంపూర్‌లో 10 వార్డులు, వడ్డేపల్లిలో 10 వార్డులున్నాయి. కొన్ని నిర్దేశిత వార్డులను కలుపుకొని ఒక జోన్‌గా విభజించనున్నా రు. ఒక్కో జోన్‌కు ప్రత్యేక అధికారులను ని యమించి వీటన్నింటిని కలెక్టర్‌, మున్సిపల్‌ కమిషనర్‌, చైర్మన్లు పర్యవేక్షించనున్నారు. నియోజవర్గాల పరిధిలో ఎమ్మెల్యేలు ప్రత్యే క చొరవ తీసుకొని పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని విజయవంతం చేయనున్నారు.  


చేపట్టనున్న పారిశుధ్య కార్యక్రమాలు 

ఈ నెల 24 నుంచి చేపట్టే పట్టణ ప్రగతి కార్యక్రమంలో ప్రధానంగా పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టిని కేటాయించను న్నారు.  ప్రధాన రహదారుల వెంట ఉన్న చెత్తాచెదారాన్ని తొలగించడం, డ్రైనెజీలను నాళాలను శుభ్రపరిచి కాలువల్లో మురుగునీరు నిల్వకుండా శాశ్వత పరిష్కారాలు చేపట్టడం,  వర్షం నీరు నిల్వకుండా తగిన చర్యలు తీసుకోవడం వంటివి చేయనున్నారు. అలాగే ప్రధాన రహదారులు మరమ్మతులు చేపట్టడం,  రోడ్లపై ఎక్కడా కూడా గుంతలు లే కుండా సరి చేయడం, రోడ్లను సుందరం గా తీర్చిదిద్ది ఇరువైపులా మొక్క లు నాట డం,  వీటితో పాటు ట్రాఫిక్‌ నియంత్రణ చేసేందు కు రద్దీగా ఉండే ప్రాంతాల్లో తగిన చర్యలు తీసుకోవడం,  వీధి దీపాల మరమ్మతులు చేపట్టి ప్రతి కాలనీలోని విద్యుత్‌ కాంతులు వెదజిమ్మెలా తగిన జాగ్రత్తలు తీ సుకోవడం వంటి చర్యలు చేపట్టనున్నారు. 


అలాగే నగర వీదుల్లో, రహదారుల్లో పాస్టిక్‌ చెత్తను పూర్తిగా తొలగించే పనులు చేపట్ట డం,  ఎక్కడా కూడా పాస్టిక్‌ కనిపించకుం డా ప్రజలు, స్వచ్ఛంద సంస్థల సహకారం తీసుకొని పూర్తిగా తొలగించి డీఆర్‌సీ సెంటర్‌కు తరలించడం, ప్రధాన కూడళ్లలోని వాల్‌ పోస్టర్లను తొలగించి రహదారుల వెంట హరితహారం కార్యక్రమం చేపట్టడం, డివైడర్లకు రంగులు వేయించి అం దంగా తీర్చిదిద్దం వంటి కార్యక్రమాలను చేపట్టనున్నారు. వీటన్నింటిని ఒక్కో రోజు, ఒక్కో కార్యక్రమంగా విడతల వారీగా నిర్థిష్టం రోజులను కేటాయించి చేపట్టనున్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ ప్రజలకు స్వచ్ఛతపై అవగాహనలు తీసుకువచ్చి స్వచ్ఛందంగా పారిశుధ్య పనుల్లో పాల్గొనేలా చేయనున్నారు. 


 సరిపడా సిబ్బంది, యంత్రాల ఏర్పాటు

అధికారులు నిర్ణయించిన లక్ష్యాలన్నింటిని చేరు కొనేందుకు తగిన చర్యలు చేపట్టనున్నారు. జిల్లాలోని 4 మున్సిపాలిటీల పరిధిలో చేపట్టాల్సిన పనులకు సం బంధించి ప్రజాప్రతినిధులతో చర్చించి జిల్లా అధికారులు ప్రణాళికలు చేపట్టనున్నారు. మున్సిపాలిటీల్లో  జోన్లను విభజించి జోన్లు వా రీగా కార్యక్రమాలను చేపట్టనున్నారు. ఈ జోన్లలో సరిపడా వినియోగించే యం త్రాలను సమకూ ర్చనున్నారు. వార్డుల్లో గల పారిశుధ్య పనులను చేపట్టేందు కు ఏఏ యంత్రాలు అవసరమవుతాయో ప్రణాళికలు ఏర్పాటు చేస్తున్నారు. ఇక జోన్ల వారీగా సరిపడా సిబ్బందిని కూడా నియమించనున్నారు. 


logo