ఆదివారం 29 మార్చి 2020
Gadwal - Feb 18, 2020 , 23:37:08

సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవాలి

సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవాలి

మన సంస్కృతి, సంప్రదాయాలను కాపాడు కోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని జెడీ చైర్‌పర్సన్‌ సరిత అన్నారు. మంగళవారం పట్టణంలోని తిక్కవీరేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహిస్తున్న అంతర్‌ రాష్ట్ర సేద్యపుటెద్దుల విభాగం బండలాగుడు పోటీలను జెడ్పీ చైర్‌ పర్సన్‌ శాస్ర్తోప్తంగా పూజలు చేసి ప్రారంభించారు.

  • రైతుల సంతోషం కోసమే సంబురాలు
  • జెడ్పీ చైర్‌ పర్సన్‌ సరిత
  • పట్టణంలో అంతర్‌ రాష్ట్ర బండలాగుడు పోటీలు ప్రారంభం

అయిజ : మన సంస్కృతి, సంప్రదాయాలను కాపాడు కోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని జెడీ చైర్‌పర్సన్‌ సరిత అన్నారు. మంగళవారం పట్టణంలోని తిక్కవీరేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహిస్తున్న అంతర్‌ రాష్ట్ర సేద్యపుటెద్దుల విభాగం బండలాగుడు పోటీలను జెడ్పీ చైర్‌ పర్సన్‌ శాస్ర్తోప్తంగా పూజలు చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా రైతులనుద్దేశించి జెడ్పీ చైర్‌పర్సన్‌ మాట్లాడుతూ.. నడిగడ్డలో జాతరలు, తిరునాళ్లలో రైతులు సంతోషం కోసమే బండలాగుడు పోటీలు నిర్వహించడం జరుగుతుందన్నారు. పశువులను అల్లారు ముద్దుగా పెంచు కుంటారన్నారు. ప్రభుత్వం రైతుల సంక్షేమమే ధ్యేయంగా పథకాలను అమలు చేస్తుందన్నారు. తిక్కవీరేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తుండటం గర్వకారణమన్నారు. జిల్లాలో ఎక్కడాలేని విధంగా రోజుకో పోటీలతో రైతులు, ప్రజల్లో ఉత్సాహం నింపడం సంతోషంగా ఉందన్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులను ఆమె అభినందించారు. అనంతరం శాస్ర్తోప్తంగా పూజలు చేసి గుమ్మడికాయ కొట్టి బండలాగుడు పోటీలను చైర్‌పర్సన్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా చైర్‌పర్సన్‌ను దేవస్థాన కమిటీ శాలువా, పూలమాలతో సన్మానించారు. 


తిక్కవీరేశ్వరస్వామికి జెడ్పీ చైర్‌పర్సన్‌ పూజలు ..

పట్టణంలోని తిక్కవీరేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం తిక్కవీరేశ్వరస్వామిని జెడ్పీ చైర్‌పర్సన్‌ సరిత దంపతులు దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ నాయకులు మల్లిఖార్జున్‌ రెడ్డి, తిరుపతయ్య, పెద్ద బుజ్జి, నర్సింహారెడ్డి, హనుమంతురెడ్డి, రవి, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు, రైతులు పాల్గొన్నారు. 


బండలాగుడు పోటీల విజేతలు వీరే..

తిక్కవీరేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం నిర్వహించిన సేద్యపుటెద్దుల విభాగం బండలాగుడు పోటీలలో విజేతలను నిర్వాహకులు ప్రకటించారు. కర్నూల్‌ జిల్లా డోన్‌ మండలం కొత్తకోట గ్రామానికి చెందిన గురునాథ్‌ వృషభరాజములు 5,003 అడుగుల దూరం బండనులాగి మొదటి స్థానంలో నిలువగా, జోగుళాంబ గద్వాల జిల్లా అయిజ మండలం చిన్న తాండ్రపాడు గ్రామానికి చెందిన శ్రీనివాసులు వృషభరాజములు 4,382 అడుగుల దూరం లాగి రెండో స్థానంలో నిలిచాయి. ఇటిక్యాల మండలం మొగల్‌రావల్‌ చెర్వుకు చెందిన ఆకుల భాషా వృషభరాజములు 4,292 అడుగుల దూరం లాగి మూడో స్థానంలో నిలిచాయి. కర్నూల్‌ జిల్లా డోన్‌ మండలం కొత్తకోటకు చెందిన డాక్టర్‌ గురునాథ్‌కు రెండో జత వృషభరాజములు 4,251 అడుగుల దూరం లాగి నాలుగో స్థానంలో నిలిచాయి. గద్వాల మండలం, జమ్మిచెడ్‌ గ్రామానికి చెందిన వెంకటేశ్‌ వృషభ రాజములు 4,250 అడుగుల దూరం బండనులాగి ఐదో స్థానంలో నిలిచినట్లు ఆలయ కమిటీ పేర్కొంది. logo