బుధవారం 01 ఏప్రిల్ 2020
Gadwal - Feb 18, 2020 , 01:20:24

జనం మెచ్చిన నేత కేసీఆర్‌

జనం మెచ్చిన నేత కేసీఆర్‌

గద్వాల, నమస్తే తెలంగాణ: చెట్లను స్నేహితుడిగా భావిస్తే స్నేహితుడు ఎన్నిరకాలుగా ఉపయోగ పడతాడో చెట్లు పెరిగేకొద్ది అన్ని రకాలుగా ఉపయోగాలు ఉంటాయని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి అన్నారు. సోమవారం కేసీఆర్‌ జన్మదినాన్ని పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని సత్యసాయి డిగ్రీకళాశాలలో ‘నమస్తేతెలంగాణ’ ఆధ్వర్యంలో హరితహార కార్యక్ర మం చేపట్టారు. పురపాలక చైర్మన్‌ బీఎస్‌ కేశవ్‌తో కలిసి ఎమ్మెల్యే హాజరై మొక్కలు నాటారు. ప్రతి ఒక్కరూ ఇంటి ముందుతో పాటు పరిసరాల్లో తప్పని సరిగా మొక్కలు నాటాలన్నారు. రాష్ట్రంలో70 ఏళ్లలో ఏ పార్టీ చేయని అభివృద్ధి తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చేసిందన్నారు. ప్రస్తుతం అడవులు అంతరించిపోతుండడం వల్ల ఎండలు పెరిగి పోతున్నాయన్నారు. గద్వాల నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో కేసీఆర్‌ ముందుకు తీసుకెళ్లాడని చెప్పారు.


అభివృద్ధే మా లక్ష్యం : బీఎస్‌ కేశవ్‌

గద్వాల పురపాలక సంఘాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పర్చడమే తమ లక్ష్యమని మున్సిపల్‌ చైర్మన్‌ బీఎస్‌ కేశవ్‌ అన్నారు. పురపాలక సంఘంలోని ప్రతి ఖాళీ స్థలంలో మొక్కలు నాటి ఆకుపచ్చ పురపాలక సంఘంగా తీర్చిదిద్దుతామన్నారు. కార్యక్రమంలో గట్టు ఎంపీపీ విజయ్‌కుమార్‌, కేటీదొడ్డి జెడ్పీటీసీ రాజశేఖర్‌, పురపాలక వైస్‌ చైర్మన్‌ బాబర్‌, కౌన్సిలర్లు నరహరిగౌడ్‌, శ్రీమన్నారాయణ, మహేశ్‌, శ్రీనివాసులు, నేతలు తిమ్మన్న, గోవిందు, శ్రీనివాస్‌రెడ్డి, కళాశాల యాజమాన్యం బీచుపల్లి, బాలరాజు, నమస్తేతెలంగాణ బృందం నవీన్‌కుమార్‌, రఘునాథ్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి, మదన్‌మోహన్‌రెడ్డి, మునెన్ననాయిడు, వెంకట్రాములు, శ్రీనివాసులుగౌడు, అశోక్‌కుమార్‌, శ్రీనివాసులు, యాడ్స్‌ నర్సింహా, సర్కిలేషన్‌ సిబ్బంది కృష్ణ, గురు, సోమనాద్రి విద్యాసంస్థల అధినేత భాస్కర్‌రెడ్డి, బాబునాయిడు  తదితరులు పాల్గొన్నారు.  


క్షీరాభిషేకం చేసిన ఎమ్మెల్యే అబ్రహం

ఉండవెల్లి : మండలంలోని అలంపూర్‌ చౌరస్తా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సీఎం కేసీఆర్‌ జన్మదిన వేడుకలను ఎమ్మెల్యే అబ్రహం, టీఆర్‌ఎస్‌ పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అబ్రహం కేక్‌ కట్‌ చేసి, కేసీఆర్‌ చిత్ర పట్టానికి క్షీరాభిషేకం చేశారు. అనంతరం మాట్లాడుతూ సీఎం ఉద్యమ నాయకుడిగా పోరాడి తెలంగాణ రాష్ర్టాన్ని సాధించిన గొప్ప నాయకుడని, రాష్ట్ర ప్రజల సుభిక్షం కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేశారన్నారు. కార్యక్రమంలో సర్పంచులు, ఎంపీటీసీలు, టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.


logo
>>>>>>