గురువారం 02 ఏప్రిల్ 2020
Gadwal - Feb 17, 2020 , 03:42:49

అపార భగీరధుడు

అపార భగీరధుడు
  • పెండింగ్‌ ప్రాజెక్టులను రన్నింగ్‌ ప్రాజెక్టులుగా మార్చిన ఘనత

ఆర్డీఎస్‌ ప్రాజెక్టు ఉన్నా సాగునీరు అందక నడిగడ్డ రైతులు తీవ్రంగా అన్యాయానికి గురయ్యారు. సమైక్య పాలనలో రాయలసీమ గుండాలు ఆర్డీఎస్‌ తూములు ధ్వంసం చేసి నీటిని తీసుకుపోయారు. కానీ జిల్లాలో అడిగే వారే లేని పరిస్థితి. అలాంటి సమయంలో ఆర్డీఎస్‌ కోసం పాదయాత్ర చేపట్టారు కేసీఆర్‌. ఆర్డీఎస్‌ రైతులకు తెలంగాణ ఏర్పడ్డాక న్యాయం చేస్తామని చెప్పారు. చెప్పినట్లే ఆర్డీఎస్‌ రైతులకు న్యాయం జరిగింది. రికార్డు సమయంలో తుమ్మిళ్ల ప్రాజెక్టు పూర్తి చేసి నేడు రైతులకు సాగునీరు అందిస్తున్నారు. 50వేలకు పైగా ఎకరాలు సస్యశ్యామలం చేసిన ఘనత ఆయనకు దక్కింది. సమైక్య పాలనలో పెండింగ్‌ ప్రాజెక్టులుగా ఉన్న నెట్టెంపాడు, కల్వకుర్తి, భీమా, కోయిల్‌సాగర్‌ ప్రాజెక్టులు నేడు రన్నింగ్‌ ప్రాజెక్టులుగా మారాయంటే అందుకు సీఎం కేసీఆర్‌ కారణమని చెప్పవచ్చు. తెలంగాణ ఏర్పాటుకు ముందు ఉమ్మడి జిల్లాలో కేవలం జూరాల పరిధిలో మాత్రమే ఆయకట్టు సాగయ్యే పరిస్థితి. అయితే తెలంగాణ ఏర్పాటు అయ్యాక పెండింగ్‌ ప్రాజెక్టులన్నీ పూర్తి చేసి సుమారు 7లక్షలకు పైగా ఆయకట్టును తీసుకువచ్చిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుంది. ఉమ్మడి జిల్లా పరిధిలో 933 చెరువులను నింపి వాటి ద్వారా రైతులకు సాగునీరు అందించిన ఘనత ఆయనదే. అచ్చంపేట ప్రాంతానికి 15వేల ఎకరాలకు సాగునీరు అందించేందుకు చంద్రసాగర్‌, కల్వకుర్తిలో 37వేల ఎకరాల చివరి ఆయకట్టు కోసం కల్వకుర్తి టెయిల్‌ ఎండ్‌ ప్రాజెక్టులను అనుమంతించారు. జూరాల ప్రాజెక్టుపై ఆధారపడిన అనేక ప్రాజెక్టులకు ఇప్పుడున్న ప్రాజెక్టు సరిపోని పరిస్థితుల్లో కొత్తగా 20 టీఎంసీల నీటితో మరో భారీ రిజర్వాయర్‌ నిర్మించేందుకు కసరత్తు ప్రారంభించారు.


logo