బుధవారం 08 ఏప్రిల్ 2020
Gadwal - Feb 17, 2020 , 03:40:11

కొలువుదీరిన విండో పాలకవర్గాలు

కొలువుదీరిన విండో పాలకవర్గాలు

జోగుళాంబ గద్వాల జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ :  సహకార ఎన్నికల్లో గెలుపొందిన అభ్యర్థుల నుంచి చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ ఎన్నికల ప్రక్రియను ప్రిసైడింగ్‌ అధికారులు చేపట్టారు. రాజ్యంగబద్ధంగా రహస్య ఓటింగ్‌ ద్వారా డైరెక్టర్లు తాము ఎన్నుకునే చైర్మన్‌కు ఓటు వేశారు. అనంతరం మెజారిటీ పొందిన చైర్మన్‌ అభ్యర్థిని, వైస్‌ చైర్మన్‌ అభ్యర్థులను ఎన్నికల అధికారులు అధికారికంగా ప్రకటించి ధ్రువీకరణ పత్రం అం దించారు. దాదాపుగా 90శాతం స్థానాలో టీఆర్‌ఎస్‌ కార్యకర్తలే చైర్మన్‌ పదవిని సొంతం చేసుకున్నారు. టీఆర్‌ఎస్‌ పార్టీకి ఎదురులేదని రైతులంతా ముక్త కంఠంతో చాటి చెప్పారు. ఎన్నికల అనంతరం గ్రామా ల్లో టీఆర్‌ఎస్‌ శ్రేణులు సంబురాల్లో మునిగితేలారు. 


టీఆర్‌ఎస్‌కు 8మంది చైర్మన్లు

ఆదివారం ఎన్నికల అధికారులు నిర్వహించిన సహకార సంఘం చైర్మన్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ తరుపున 8మంది చైర్మన్‌ పదవులను పొందారు. జిల్లా లో మొత్తం 11 సహకార సంఘాలుండగా వా టిలో 9 సహకార సంఘాలకు ఎన్నికల అధికారులు పరోక్ష పద్ధతిలో ఎన్నికలు నిర్వహించారు. చైర్మన్‌ పదవికోసం నామినేషన్‌ వేసిన అభ్యర్థులకు గుర్తులు కేటాయించి ఎ న్నికల నిర్వహించారు. చాలా వరకు అన్ని స్థానాల్లో ఏకగ్రీవంగా చైర్మన్‌ అభ్యర్థులను ఎన్నుకున్నారు. కలు గొట్ల సహకార సం ఘంలో ఒక్క స్థానంలో మాత్రం కాంగ్రెస్‌ దక్కించుకుంది. ఇక సహకార సంఘాల వారిగా మానవపాడు చైర్మన్‌ శ్రీధర్‌, వైస్‌ చైర్మన్‌గా అయ్యన్న, వడ్డేపల్లిలో పచ్చర్ల గోపాల్‌ రెడ్డి, వైస్‌ చైర్మన్‌ రామాపురం లక్ష్మీరెడ్డి, కలుగొట్ల చైర్మన్‌గా గజేందర్‌ రెడ్డి, వైస్‌ చైర్మన్‌ అబ్జర్‌అలీ, పుటాన్‌దొడ్డి చైర్మన్‌గా రంగారెడ్డి, వైస్‌ చైర్మన్‌  శ్రీనివాస్‌రెడ్డి,, క్యా తూర్‌ చైర్మన్‌గా పెదమారు వీర వెంకట రా ఘవరెడ్డి, వైస్‌ చైర్మన్‌ జగన్మోహన్‌ రెడ్డి, అ యిజ చైర్మన్‌ మధుసూధన్‌ రెడ్డి, వైస్‌ చైర్మన్‌ శారద మల్దకల్‌ చైర్మన్‌ తిమ్మారెడ్డి, వైస్‌ చైర్మన్‌ కురువ విష్ణు, గట్టు చైర్మన్‌ క్యామ వెంకటేశ్‌, వైస్‌ చైర్మన్‌ మహదేవ్‌, గద్వాల చైర్మన్‌ సుభాన్‌, వైస్‌ చైర్మన్‌ వెంకటేశ్వర్లు ఎన్నికయ్యారు.


అలంపూర్‌, ధరూర్‌ల్లో ఎన్నిక వాయిదా

అలంపూర్‌, ధరూర్‌ సహకార సంఘాల చైర్మన్‌ ఎన్నికలు వాయిదా పడ్డాయి. అలంపూర్‌లో చైర్మన్‌ ఎన్నికకు 13 మంది డైరెక్టర్లలో కేవలం ఒకే ఒక్క డైరెక్టర్‌ మాత్రమే హాజరయ్యారు. మిగితా సభ్యులెవరూ కూడా హాజరుకాకపోవడంతో కోరం లేకపోవడంతో ఎన్నికల అధికారులు చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ ఎన్నికలను నేటికి వాయిదా వేశారు. ఇక ధరూర్‌లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది 13 మంది డైరెక్టర్లలో ఒక్క డైరెక్టర్‌ కూడా ఎన్నికకు హాజరుకాలేదు. చైర్మన్‌ పదవి కోసం నామినేషన్‌ వేయలేదు. దీంతో ప్రిసైడింగ్‌ అధికారులు ఈ రెండు సహకార సంఘాల్లో ఎన్నికలను వాయిదా వేశారు. తిరిగి ఎన్నికలను ఈ రోజు నిర్వహిస్తున్నట్టుగా నోటీసు బోర్డ్‌ ద్వారా ప్రకటించారు. ఈ ఎన్నికకు కూడా ఎవరూ హాజరుకాకపోతే రాష్ట్ర ఎన్నికల అధికారుల దృష్టికి తీసుకెళ్లనున్నారు.


కార్యకర్తల సంబురాలు

జిల్లాలో అత్యధిక స్థానాల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ చైర్మన్‌ స్థానాలను కైవసం చేసుకోవడంతో ఆ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. గ్రామాల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ బలపరిచిన అభ్యర్థులకు ఓటు వేసిన ప్రతి రైతుకు పేరుపేరునా ధన్యవాధాలు తెలుపుతున్నారు. సహకార సంఘాల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ జెండా ఎగురడం వలనే అభివృద్ధి సాధ్యమవుతుందని రైతులు పూర్తిగా విశ్వసిస్తున్నారు. రైతుల కోసం సీఎం కేసీఆర్‌ ప్రవేశ పెట్టిన పథకాల వలనే ఈ ఘన విజయాన్ని సాధించగ లిగారు. ఇక నుంచి జిల్లా అన్ని రంగాల్లో శరవేగంగా అభివృద్ధిలో దూసుకుపోనుంది. 


logo