బుధవారం 01 ఏప్రిల్ 2020
Gadwal - Feb 16, 2020 , 00:59:26

కారుకే సహకారం

కారుకే సహకారం

జోగుళాంబ గద్వాల జిల్లా ప్రతినిధి, నమస్తేతెలంగాణ : ఎన్నికలేవైనా విజయం గు లాబీ పార్టీదేనని మరోసారి రుజువైంది. గతం లో నిర్వహించిన అన్ని ఎన్నికల్లానే ఈ ఎన్నిక ల్లో కూడా ఫలితాలు పునరా వృతమయ్యాయి. ప్రజలంతా టీఆర్‌ఎస్‌ వైపే ఉన్నారని తేలిపోయింది. సీ ఎం కేసీఆర్‌ రైతుల కోసం దేశంలో ఎక్కడా లేని పథకాలను ప్రవేశపెట్టి రైతు ల అ భ్యున్నతి కోసం పాటుపడుతున్నారు. ఇందుకు కృతజ్ఞత తెలియ జేసేందుకు రైతులంతా టీఆర్‌ఎస్‌ బలపరిచిన అభ్యర్థులకు పట్టం కట్టారు. అత్యధికంగా చైర్మన్‌ స్థానాలను టీఆర్‌ఎస్‌ పార్టీ కైవసం చేసుకోగా కాంగ్రెస్‌, బీజేపీలు చేరొక స్థానాలను సొంతం చేసుకున్నాయి. ఇక ఇండిపెండెంట్‌ అభ్యర్థులు 2స్థానాలను కైవసం చేసుకున్నారు. 


టీఆర్‌ఎస్‌కు 7 చైర్మన్లు

ఈ ఎన్నికల్లో మొత్తం 11 సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహించగా వీటిలో అత్యధికంగా టీఆర్‌ఎస్‌ పార్టీ 7 చైర్మన్‌ స్థానాలకు కేవసం చేసుకుంది. కాంగ్రెస్‌ , బీజేపీలు చేరో స్థానాన్ని కైవసం చేసుకోగా స్వతంత్రులకు 2 స్థానాలు దక్కాయి. వీటిలో గద్వాల, అలంపూ ర్‌, మానవపాడు, పుటాన్‌దొడ్డి, గట్టు, క్యాతూ ర్‌, మల్దకల్‌లో టీఆర్‌ఎస్‌ జయకేతనం ఎగు రవేసింది. అయిజ, వడ్డేపల్లిలో ఇండిపెండెట్లు గా గెలిచిన అభ్యర్థులు కూటమిగా ఏర్పడి చైర్మ న్‌ స్థానాలను సొంతం చేసుకున్నారు. ఇక ధరూర్‌లో బీజేపీ, కలుగొట్లలో కాంగ్రెస్‌ పార్టీలు ఖా తాలను తెరిచాయి. జిల్లా వ్యాప్తం గా గట్టు సహకార సంఘంలో టీఆర్‌ఎస్‌ పార్టీ విండోలోని మొత్తం 13 స్థానాలను సొంతం చేసుకొని రికార్డ్‌ను నెలకొల్పింది. 


87 వార్డులు టీఆర్‌ఎస్‌ సొంతం

జిల్లాలో మొత్తం 143 వార్డులుండగా ఎన్ని కల అధికారులు క్యాతూర్‌ లోని ఒక వార్డుకు ఎన్నిక వాయిదా వేసి మొత్తం 142 స్థానాలకు ఎన్నికలు నిర్వహించారు. వీటిలో 39 స్థానాల్లో వార్డులకలో ఏకగ్రీవంగా ఎన్నికవ్వగా 103 స్థానాల్లో పోలింగ్‌ జరిగింది. ఈ ఏకగ్రీవాలతో కలుపుకొని టీఆర్‌ఎస్‌ పార్టీకి 87 వార్డులు, కాంగ్రెస్‌కు 25 వార్డులు, బీజేపీ 16 వార్డుల్లో, ఇండి పెండెంట్లు 14 వార్డుల్లో విజయం సాధించారు. 


గెలిచిన అభ్యర్థులను అభినందించిన ఎమ్మెల్యే

ఉండవెల్లి : సహకార సంఘం ఎన్నికల్లో గెలి చిన అభ్యర్థులు మధ్యాహ్నం 3 గంటలకే అ లంపూర్‌ చౌరస్తాలోని ఎమ్మెల్యే క్యాంప్‌ కా ర్యాలయానికి టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యకర్తలు అధిక సంఖ్యలో తరలివచ్చారు.  దీంతో ఎమ్మె ల్యే క్యాంప్‌ కార్యాలయం టీఆర్‌ఎస్‌ పార్టీ కార్య కర్తలతో సందడిగా మారింది.  ఈ సందర్భంగా స్వీట్లు పంచుకొని సంబురాలు జరుపు కున్నారు. అలంపూర్‌, క్యాతూరు సహకార సం ఘం డైరెక్టర్‌లను ఎమ్మెల్యే అబ్రహం శాలువా పూలమాలతో ఘనంగా సన్మనించారు. 


logo
>>>>>>