శుక్రవారం 10 ఏప్రిల్ 2020
Gadwal - Feb 16, 2020 , 00:56:26

ప్రశాంతంగా పోలింగ్‌

ప్రశాంతంగా  పోలింగ్‌

జోగుళాంబ గద్వాల జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ  :   సహకార సంఘం ఎన్నికల పోలింగ్‌  ప్రశాంతంగా ముగిసిం ది. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పోలీసులు కట్టుదిడ్డమై న భద్రత చేపట్టారు. బరిలో నిలిచిన అ భ్యర్థుల నుంచి వారి వర్గాల నుంచి ఎలాంటి ఘర్షణలు తలెత్తకుండా పోలీసులు పకడ్బందీగా వ్యవహరించారు.  ఓటింగ్‌లో పాల్గొనేందుకు వచ్చిన ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఎన్నికల అధికారులు సకల సదుపాయాలు కల్పించారు. వృద్ధులు వికలాంగులకు ప్రత్యేకంగా వీల్‌చైర్లు ఏర్పాటుచేసి స్వేచ్ఛగా పోలింగ్‌లో పాల్గొనేలా చర్యలు చేపట్టారు. 


పోలింగ్‌ జరిగిన తీరు

ఉదయం 7గంటలకు ప్రారంభమైన పో లింగ్‌ అన్ని సహకార సంఘాలలో  మందకొడిగా కొనసాగింది. ఉదయం 9గంటల నుంచి రైతుల ఓటింగ్‌లో అధికంగా పాల్గొనడంతో పోలింగ్‌ ఊపందుకుంది. దీంతో ఉదయం 9గంటలకు 14.3శాతం, 10గంటలకు 27.64శాతం, 11గంటలకు 41.74శాతం, 12గంటలకు 53.74శాతం, 1గంటలకు 65.66శాతం, 2గంటలకు 72.71శాతం పోలింగ్‌ నమోదైంది. మండ ల కేంద్రాల్లో పోలింగ్‌ సెంటర్‌లను ఏర్పా టు చేయడంతో రైతులు గ్రామాల నుంచి తరలివచ్చేందుకు కాస్త ఆలస్యం జరిగింది. దీంతో 9గంటల వరకు కూడా మందకొడిగా పోలింగ్‌ కొనసాగతూ వచ్చింది. ఆ తరువాత గ్రామాల వారీగా రైతులు ఒకే సారి తరలిరావడంతో పోలింగ్‌ ఊపందుకుంది. ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని సదుపాయాలు చేపట్టారు. 

 

ఓటింగ్‌లో పాల్గొన్న 36,643 మంది

సహకార సంఘం ఎన్నికల్లో మొత్తం 11 విండోల పరిధిలో 143 స్థానాలుండగా వా టిలో 103 స్థానాలకు పోలింగ్‌ నిర్వహించా రు. ఈ ఎన్నికల్లో జిల్లా వ్యాప్తంగా 59,393 మంది ఓటర్లుండగా వీరిలో 36,643 మం ది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అత్యధికంగా కలుగొట్లలో మొత్తం 929 మంది ఓటర్లుండగా వీరిలో 828 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడంతో 89.13 శాతం పోలింగ్‌ నమోదైంది. అత్యల్పంగా వడ్డేపల్లిలో 5,376 మంది ఓటర్లుండగా వీరిలో 3,490 మంది ఓటర్లు తమ ఓటు హక్కు ను వినియోగించుకోవడంతో 64.92శాతం పోలింగ్‌ నమోదైంది. ఇక విండోల వారీగా గద్వాలలో 7,164 మంది ఓటర్లకు గాను 5,798 మంది ఓటు వేయడంతో  80.93 శాతం, ధరూర్‌లో 8,961 మంది ఓటర్లకుగాను 6,4387 మంది ఓ టు వేయడంతో  71.84శాతం, గట్టులో 8,495 మంది ఓటర్లుకు గాను 6,124 మంది ఓటు వేయడంతో 72.09శాతం న మోదైంది. 


అలాగే మల్దకల్‌లో 5,409 మం ది ఓటర్లకుగాను 4,174 మంది ఓటు వే యడంతో  77.17శాతం, అయిజలో 9,930 మంది ఓటర్లులో 6475 మంది ఓ టు వే యడం తో  65.21శాతం, మానవపాడులో 960 మంది ఓటర్లకుగాను 789 మంది ఓటు వేయడంతో  82.19శాతం, పుటాన్‌దొడ్డిలో 1324 మంది ఓటర్లకు గాను 1066 మంది ఓటు వేయడంతో  80.51శాతం, అలంపూర్‌లో 1410 మం ది ఓటర్లకుగాను 1137 మంది ఓటు వేయడంతో  80.64శాతం, 435 మంది ఓటర్లకుగాను  క్యాతూర్‌లో 324 మంది ఓటు వే యడం తో  74.48శాతం పోలింగ్‌ నమోదైంది. 


logo